👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గ్రామ ఆవిర్భావానికి తన స్వంత భూములను దానం చేసిన గొప్ప దార్శనికుడు, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శనీయుడు మన ఏలేటి రాజారాం రెడ్డి అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం రాజారాం పల్లి గ్రామంలో ఆదివారం ఏలేటి రాజారాం రెడ్డి, కాంస్య విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ…

స్వంత భూములను గ్రామం ఆవిర్భావానికి , నిర్మాణానికి స్వచ్ఛందంగా దానం చేసిన రాజారాం రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచి పోయారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాజారాం రెడ్డి పేరు మీద చేసే సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
