👉 అన్ని స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాల్సిందే !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాజకీయ పార్టీ గుర్తు లేకుండా గ్రామాల్లో జరిగిన సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలకు ఓ లెక్క ఉంది. ఈ నెల11 జరగనున్న ఎన్నికలకు మరో లెక్క ఉంటుంది. పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపుకు కష్టపడాలి, రెబల్ గా పోటీ చేసినా , కోవర్టు చేసినా, అంతే సంగతులు ధర్మపురి మున్సిపాలిటీలో 15 కౌన్సిలర్ స్థానాలకు 15 గెలుచుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంగళవారం రాత్రి ధర్మపురి పట్టణ కీలక నాయకులకు సూచించినట్టు సమాచారం.
పోలింగ్ బూత్ ల వారిగా ఓటర్లను బూత్ వరకు తేవడం ఓటు వేయించడం , ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని రప్పించడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వ్యక్తిగతంగా చేసిన పనులను ఓటర్లకు వివరించాలని, పోలింగ్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేయాలని మంత్రి నాయకులకు వివరించినట్టు సమాచారం.
గెలిచాక తనతో నడిచే వాళ్ళ కంటే నా గెలుపు కోసం నా వెంట నడిచిన వాళ్ళని నేను ఎన్నటికీ మర్చిపోను, కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గంలో నియమించిన మార్కెట్ కమిటీల చైర్మన్ లు , డైరెక్టర్ పదవులే మీకు కనిపిస్తున్న ప్రత్యక్ష నిదర్శనం అని అన్నట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన చూసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారిని గౌరవిస్తూ, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెంట ఉన్న వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఉద్వేగ భరితంగా వివరించినట్టు సమాచారం.
పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 70,% పంచాయతీలు మన పార్టీ జెండా ఎగురవేసింది, జిల్లాలో ఐదు మున్సిపాలిటీలలో మన పార్టీ అభ్యర్థులే విజయం సాధించాలని నిర్మొహమాటంగా మంత్రి అన్నట్టు సమాచారం.
రానున్న జెడ్పిటిసి, ఎంపీటీసీ, ఎన్నికలలో పార్టీ టికెట్ల ప్రాధాన్యత, నామినేటెడ్ పదవులు, సింగిల్ విండో, డైరెక్టర్లు, చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆసుపత్రి కమిటీలు, ఆలయాల చైర్మన్లు ధర్మకర్తలు, విద్యా కమిటీ,పార్టీ పదవులు. నామినేటెడ్ పదవులు ఎన్నికలలో పనితీరు ప్రాతిపదికనే సమిష్టి నిర్ణయం మేరకు ఉంటుందని మంత్రి అన్నట్టు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, విద్య ఉద్యోగ ఉపాధి సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరుతున్నాయని మంత్రి కార్యకర్తలకు వివరించినట్టు తెలిసింది.
👉 రెబల్ అభ్యర్థులు లేకుండా…

మున్సిపాల్ ఎన్నికల్లో ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న అభ్యర్ధుల పేర్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ఫైనల్ చేశారు. ఈసారి మున్సిపాల్ ఎన్నికల్లో ధర్మపురి మున్సిపాలిటి పరిధిలోని 15 వార్డుల్లో ఒక్కో వార్డుకు దాదాపు ముగ్గురు అభ్యర్థులు పార్టీ టికెట్లను ఆశించారు.
వార్డుల్లో రెబల్స్ బెడద లేకుండ అన్ని వర్గాలను ఒప్పించి చివరకు అభ్యర్ధులను మంత్రి ఫైనల్ చేశారు. మున్సిపాల్ ఎన్నికలపై మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టికెట్ల కేటాయింపు విషయంలో తనదైన పద్దతిలో వివాదాలకు తాపు లేకుండ చర్యలు తీసుకున్నారు. కార్యకర్తలు నాయకులతో పలుసార్లు చర్చిస్తూ వివిధ సమీకరణతో పట్టణంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేసే విధంగా టికెట్లు కేటాయించారు.
👉 వార్డు సంఖ్య 👉 అభ్యర్ధి పేరు
👉 1వ వార్డు అయ్యోరి వేణుగోపాల్
👉 2వ వార్డు సంగంబట్ల సంతోషి
👉 3వ వార్డు ఇందారపు రామయ్య
👉 4వ వార్డు కొమురవెళ్లి పవన్ కుమార్
👉 5వ వార్డు వేముల నాగలక్ష్మి
👉 6వ వార్డు ముడుసుల ప్రశాంత్
👉 7వ వార్డు వాంక్ డోత్ విజయ్ బాబు
👉 8వ వార్డు జంజిరికాని సువర్ణ
👉 9వ వార్డు వీరవేణి నాగలక్ష్మి
👉 10వ వార్డు సంగి ఆనంద్
👉 11వ వార్డు జక్కు పద్మ
👉 12వ వార్డు చుక్క సంధ్య
👉 13వ వార్డు చీపిరిశెట్టి రాజేశ్
👉 14వ వార్డు వేముల రమాదేవి
👉 15వ వార్డు ఓజ్జల లక్ష్మణ్
