శివాలయాలు దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజు సోమవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి బుగ్గారం, పెగడపల్లి మండలాలలోనీ శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ధర్మపురి మండలంలోని నేరేళ్ల గ్రామంలో సోమవారం శ్రీ సాంబశివ ఆలయంలో, బుగ్గారం మండలంలోని శ్రీ సాంబశివ నాగేశ్వర ఆలయలను మంత్రి  దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక ఆర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులతో మంత్రి ముచ్చటించారు.


👉 పెగడపల్లి మండలంలో…


పెగడపల్లి మండల కేంద్రంలో స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి కి వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందించారు.


ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలోని సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన శివుని విగ్రహాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….
మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే పవిత్రమైన రోజు అని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.