👉 ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షం ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మున్సిపాల్ ఎన్నికల్లో సెంటిమెంట్ ను రగిలించి ఓట్లు దండుకోవడానికి సిట్ విచారణపై మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు లు డ్రామాలు ఆడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ మాజీ సీఎం కేసీఆర్ ను విచారిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రవర్తిస్తున్న తీరుపై మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ మాటలలో …
ఫోన్ ట్యాఫింగ్ విషయంలో కేసీఆర్ ను సిట్ విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు కెసిఆర్ దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా, శాంత్రి యాత్రలు ఇంకో యాత్రలు అని కాంగ్రెస్ పార్టీపై బుదరజల్లే కార్యక్రమం ఆ పార్టీ చేస్తున్నది అన్నారు.
👉 ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లు చేసిన మాట వాస్తవం కాదా,
ఆధారాలు లేకుండ సిట్ విచారణకు పిలవదు..
👉 ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారుల భూములు రాయించుకున్నది, డబ్బులు వసూళ్లు చేసింది నిజం కాదా మంత్రి అని ప్రశ్నించారు. వీరుచేసిన పాపాలు కాళేశ్వరం ఒక్కటి అయితే రెండవది ఫోన్ ట్యాపింగ్.
👉 ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత దుర్మగమైన చర్యరాష్ర్టంలో 10ఏళ్లు అధికారంలో ఉండి కల్వకుంట్ల రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని భావిస్తే ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
👉 టిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో వీరు చేసిన పాపాలు, అవినీతి,అక్రమాలు ఒకోక్కటి వెలుగులోకి వస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
👉 దేశంలోని పేద ప్రజలకు ఉపాధి కల్పించే జాతీయ ఉపాధి హామీ పేద ప్రజలకు 100 రోజు పని కల్పిస్తే ఇలాంటి ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎందుకు ఫాంహౌజ్ నుంచి బయటికి వచ్చి కేసీఆర్ మాట్లాడం లేదు.
👉 వ్యక్తిగతంగా వారికి ఇబ్బంది అయినప్పుడు మాత్రమే రాష్ర్ట ప్రజలకు విఫరితమైన ఇబ్బందులు అందోళనలో ఉన్నట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రులు నాటకాలు ఆడుతున్నారు.
👉 వాస్తవాలు ఎప్పుడు దాగవని, సిట్ ఏలాంటి ఆధారాలు లేకుండ నోటిసులు ఇవ్వదని విచారణ చేస్తేనే మీరు దోషులా ? కాదా ? అనే విషయం తెలుస్తుంది, బీఆర్ఎస్ నేతలు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు, ఏలా తప్పించుకోవాలో తెలియక సెంటిమెంట్ రగిలిస్తున్నారు.
👉 చట్టం తన పని తాను చేసుకుంటు పోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గతం తీసుకుంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు రోడ్డు మీద తిరిగే వారు కాదు
👉 మీరు చేసిన పాపాలకు సిట్ తో పాటు, రేపు కాళేశ్వరం విషయంలో సీబీఐ సైతం వస్తుంది ప్రజలు ఇచ్చిన అధికారం అడ్డంపెట్టుకొని చేసిన దోపిడికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సమాధానం చెప్పాలి.
👉 తోడ పుట్టిన చెల్లి, కన్న బిడ్డ కవిత, ఆమె భర్త కెసిఆర్ అల్లుడి ఫోన్ ట్యాపింగ్ పై ఆమె చేసిన ఆరోపణలకు ముందు సమాధానం చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
