J SURENDER KUMAR,
నిజాంబాద్ జిల్లాలో ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున ₹1 కోటి రూపాయల చెక్కును శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి తల్లి, ఇతర కుటుంబ సభ్యులకు అందించారు.
ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులకు ఆ చెక్కును అందించారు.
👉 కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి !

గతేడాది విధి నిర్వహణలో దుండగుల చేతిలో కత్తిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయంగా ₹1 కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమోద్ భార్య ప్రణీత కు అందించారు.
‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులకు ఆ చెక్కును అందించారు.
👉 క్రికెట్ బృందానికి అభినందనలు !
అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. విశ్వ వేదికపై మన క్రీడాకారుల విజయ పరంపర దేశానికి గర్వకారణమన్నారు. యువ ఛాంపియన్ల అసమాన ప్రతిభ భారత క్రికెట్ భవిష్యత్తుకు మరింత భరోసానిస్తోందన్నారు.

అంకితభావం, నైపుణ్యం, పోరాట పటిమలో గత తరం క్రీడాకారుల స్ఫూర్తిని కొనసాగిస్తూనే, ఈనాటి యువత అత్యంత ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిని చాటడం అభినందనీయమని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
