👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ !
J.SURENDER KUMAR,
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారి అడుగుజాడల్లో నడవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…..
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలోని ప్రజలు అందరు తమ సాంప్రదాయాలు, సంస్కృతులను కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరారు.

ఆయన ఆలోచనలు, బోధనలు గిరిజన జాతులకు అపారమైన స్ఫూర్తినిచ్చాయని , వారి బోధనలను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. చెడు అలవాట్లను విస్మరించి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని ఉన్నతమైన జీవన విధానాన్ని పెంపొందించుకోవడానికి మంచి సంస్కృతులు, సాంప్రదాయాలను కొనసాగించాలని వారి ఆలోచనలు, బోధనలు, గిరిజన జాతులకు, తెగలకు ఎంతో గొప్ప స్ఫూర్తిని అందించాయని అలాంటి మహనీయుల బాటలో సమాజంలో అందరు కలిసికట్టుగా ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు.
ఈకార్యక్రమంలో గిరిజన సాంప్రదాయ వేషధరణ ధరించి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేసిన చిన్నారులను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ అభినందించి శాలువాలతో సత్కరించారు. ఈ జయంతిని పురస్కరించుకొని చిన్నారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు మరియు కళాకారుల పాటలు ప్రత్యేకంగా అలరించాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె.రాజ్ కుమార్, జిల్లా అధికారులు, గిరిజన సంఘ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, కలెక్టరేట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
