స్వచ్ఛ ధర్మపురి – స్వచ్ఛ గోదావరి లక్ష్యంగా !

👉 గోదావరి పవిత్రను కాపాడే మొదటి ప్రయత్నం ఇది !

👉 పరిశుభ్ర గోదావరి కోసం పార్టీలకు అతీతంగా ముందుకు రావాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

గోదావరి నది పవిత్రతను కాపాడలనే లక్ష్యంతో ‘స్వచ్ఛ ధర్మపురి.. స్వచ్ఛ గోదావరి..’ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించి గోదావరి పవిత్రతను కాపాడే బాధ్యతలో భాగస్వాములు కావాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ధర్మపురి మున్సిపాలిటీకి కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ఆధ్వర్యంలో గోదావరి నది పవిత్రతను కాపాడే కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛ ధర్మపురి.. స్వచ్ఛ గోదావరి..’ కార్యక్రమాన్ని మంగళవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి గోదావరి తీరంలో ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్, మాట్లాడుతూ …..

ధర్మపురి క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారని అన్నారు. ధర్మపురి పవిత్రత పెంపొందించడంతో పాటు గోదావరి పవిత్రత కాపాడాలని లక్ష్యంతో తాము ‘స్వచ్ఛ ధర్మపురి.. స్వచ్ఛ గోదావరి..’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు.
గోదావరి నది స్వచ్ఛతను కాపాడడానికి పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

👉 గోదావరి పవిత్రత కోసం  స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు ముందుకు వచ్చి ప్రతిరోజు స్వచ్ఛ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కోరారు. ధర్మపురి లో పుట్టి పెరిగిన వారు ఇక్కడి రుణం తీర్చుకోవడానికి ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పాల్గొనాలని మంత్రి కోరారు.

👉 గోదావరి నది పవిత్రతను కాపాడడానికి భక్తులు సైతం సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తులు తమ వెంట తీసుకువచ్చిన పాత బట్టలు ఇతర వస్తువులు సూచించిన ప్రదేశాల్లో వేయాలని గోదావరి నీటిలో వేయడం వలన నది కలుషితం అవుతుందని  మంత్రి అన్నారు.

👉 ఈనెల 27న ధర్మపురికి కన్సల్టెన్సీ ప్రతినిధులు…..

👉 2027 జూన్ లో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఇప్పటి నుండి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ధర్మపురిలో చేపట్టే అభివృద్ధి పనుల అంచనాలు తయారు చేయడానికి ఈనెల 27న ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ ప్రతినిధులు వస్తున్నారని మంత్రి తెలిపారు.

👉 ధర్మపురి పట్టణ ప్రజలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అనేక సంవత్సరాలుగా ధర్మపురి బ్రాహ్మణులు, అగ్రహారం పెద్దలు తమ అమూల్యమైన సలహా సలహాలు, సూచనలు అందించాలని మంత్రి కోరారు.

👉 ధర్మపురి పట్టణంలో మిగిలి ఉన్న డ్రైనేజీ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ధర్మపురి లోని డంపింగ్ యార్డ్ సమస్యకు ఒక పరిష్కారం త్వరలోనే చూపిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

👉 మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి మాట్లాడుతూ…

ధర్మపురి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నాగలక్ష్మి మాట్లాడుతూ మంత్రి అందించిన స్ఫూర్తితోనే తాము ‘స్వచ్ఛ ధర్మపురి.. స్వచ్ఛ గోదావరి..’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

మొదటి రోజు సుమారు 100 మంది స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారని ఆమె తెలిపారు. స్వచ్ఛ గోదావరి కార్యక్రమాన్ని మంత్రి  సహకారంతో 365 రోజులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, ధర్మపురి ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్ తో పాటు మున్సిపల్ కమిషనర్, ధర్మపురి తహసీల్దార్ తోపాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.