👉 మావోయిస్టు అగ్రనేతలలో..?
J.SURENDER KUMAR,
2026 మార్చి 31 లోగా భారత్ నక్సల్స్ రహిత దేశంగా ఉంటుందని హోం మంత్రి అమిత్ షా ప్రకటనతో మావోయిస్టు అగ్ర నేతలు, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పోలిటి బ్యూరో సభ్యులు తమ తమ లొంగుబాటుకు తెలంగాణ పోలీసులు ముద్దు ఇతర ప్రాంత పోలీసులు వద్దు అనే అంతర్ముదనంతో లొంగిపోతున్నట్టు తెలిసింది. మావోయిస్టు ఉద్యమ సుప్రీం కమాండర్, మావోయిస్ట్ చీఫ్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి,@ దేవ్ జి తో పాటు తో సహా కేంద్ర కమిటీ పొలిటి బ్యూరో సభ్యుడు మల్ల రాజిరెడ్డి @ సంగ్రామ, నరసింహారెడ్డి, మరో 16 మంది కీలక మావోయిస్టులు ఆదివారం తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారుల ముందు లొంగుబాటు వారి ఆలోచనలు, అంతర్ముదనంకు
నిదర్శనం.
👉 నంబాల కేశవరావు హతం తో..
మావోయిస్టు చీఫ్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తోపాటు పదుల సంఖ్యలో దండకారణ్యంలో 2025 మే లో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు హతం కాగా కేశవరావు మృతదేహం కూడా ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాకు కుటుంబ సభ్యులు తీసుకువెళ్లి అంత్యక్రియలు చేయలేని దుర్భర దుస్థితి ఆ సందర్భంలో కేశవరావు బంధుమిత్రులు చత్తీస్గడ్, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
👉 హిడ్మా ఎన్కౌంటర్ తో…
లొంగుబాటు కోసమో ? వైద్య చికిత్స కోసమా ? తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ కు మధ్యవర్తుల ద్వారా వచ్చిన మోస్ట్ వాంటెడ్ గెరిల్లా ఆర్మీ చీఫ్ మద్వి హిడ్మా తో తో పాటు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నవంబర్ 2025 న జరిగిన ఎన్కౌంటర్లో మద్వి హిడ్మా హతమవడం , దాదాపు 50 మంది మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాలలో అరెస్టు అయ్యారు. ఈ ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతలతో పాటు ఛత్తీస్గడ్ ప్రాంతం నుంచి దళాలకు దళాలు తెలంగాణ పోలీస్ ల ముందు లొంగిపోతున్నారు.
ఇది ఇలా ఉండగా పోలీసుల అమరవీరుల స్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సీఎం చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ పోలీసులు గత కొన్ని నెలలుగా మావోయిస్టు అగ్ర నేతల కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతూ రివార్డులు, జీవనోపాధికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం జనజీవన స్రవంతిలోకి రమ్మంటూ ప్రయత్నాలు చేశారు. శాంతియుత వాతావరణం కోసం అనధికారికంగా తెలంగాణ పోలీసుల కాల్పుల విరమణ చేశారు అని చెప్పుకోవచ్చు..
👉 గొంతెత్తిన పౌర హక్కుల సంఘాలు.!
దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, కాల్పులు విరమించాలని ప్రత్యేకంగా తెలంగాణ పౌర హక్కుల సంఘాలు మేధావులు పదేపదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేయడంతో పాటు, కొన్ని సందర్భాలలో మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల అదుపులో ఉన్నారంటూ బూటకపు ఎన్కౌంటర్ లో హత మారుస్తారంటూ పలు సందర్భాలలో న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు.
👉 విప్లవ ఉద్యమ చరిత్రలో..
1980-81 లో కొండపల్లి సీతారామయ్య వ్యవస్థాపక అధ్యక్షుడిగా సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ నక్సలైట్ సంస్థగా మంచిర్యాల జిల్లాలో పురుడు పోసుకున్న ఈ పార్టీ 2004 లో కే ముప్పాల లక్ష్మణరావు @ గణపతి నాయకత్వంలో బీహార్ విప్లవ పార్టీతో కలసి మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. దాదాపు 50 సంవత్సరాల విప్లవ ఉద్యమ చరిత్రలో కేంద్ర కమిటీ కార్యదర్శి ( నంబాల కేశవరావు) ఎన్కౌంటర్ లో హతం కావడం, ఆ తర్వాత కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన గొరిల్లా ఆర్మీ చీఫ్ తిప్పరి తిరుపతి @ దేవుజ్జి తెలంగాణ పోలీసుల ముందు ఆదివారం సరెండర్ కావడం విప్లవ
ఉద్యమ చరిత్రలో అరుదైన అంశం.
(మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో హతం కావడం, ప్రభుత్వానికి లొంగిపోవడం విప్లవ ఉద్యమ చరిత్రలో చోటు చేసుకున్న సందర్భం లేదు )
👉 తెలంగాణ పోలీసులు తెలివిగా ?

గత కొన్ని రోజుల క్రితం వేలాది మంది భద్రత దళాలు కర్రెగుట్ట ఆపరేషన్ – 2 పేరిట, కూంబింగ్ నిర్వహిస్తున్నారని, ఎదురు కాల్పులు జరిగాయి అగ్ర నేతలు హతం అంటూ ప్రచార సాధనాలు హోరెత్తించాయి. ఈ నేపథ్యంలో అగ్ర నేతలు దండకారణ్యం నుంచి ఆసిఫాబాద్ అడవుల నుండి, లేదా రైలు మార్గమా ? వాహనాలలో తెలియదు కానీ, హైదరాబాద్ లోఎస్ఐబి అధికారుల వద్దకు అగ్ర నేతలతో సహా 16 మంది కీలక మావోయిస్టులు శనివారం రాత్రికి చేరుకోవడంలో తెలంగాణ పోలీసులు తెలివిగా ప్రణాళిక రచించారు అనేది చర్చ.. వీరీ లొంగుబాటును చత్తీస్గడ్ ఉప ముఖ్యమంత్రి విజయ శర్మ మీడియాలో ధ్రువీకరించారు.

👉 గతంలో కీలక నేతలు సైతం..
కేంద్ర కమిటీ సభ్యులు నాలుగున్నర దశాబ్దాలు మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పుల్లూరి ప్రసాదరావు, @ చంద్రన్న, బండి ప్రకాష్ @ ప్రభాస్ 2025 అక్టోబర్ లో డిజిపి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. కీలక మావోయిస్టు నాయకులు కంకణాల రాజిరెడ్డి @ దేవా, బాడ్సే సుక్క మరో 18 మంది మావోయిస్టులు ఆయుధాలతో 2026 జనవరిలో తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు.
2025లో, దాదాపు 600 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
👉 ఛత్తీస్గడ్ టు తెలంగాణ..

దండకారణ్యం ,చత్తీస్గఢ్ లో డి ఆర్ జి బలగాల ( మావోయిస్టు మిల్టెంట్లు సానుభూతిపరులతో ఏర్పాటైన యాంటీ నక్సలైట్ దళం ఇందులో ఆదివాసి యువత మెజార్టీ గా ఉంటారు ) తో వేధింపులు, ఈ ప్రాంతంలో కొండ కోనల పై డి ఆర్ జి బలగాలకు సంపూర్ణ అవగాహన ఉండడంతో వారికి పట్టుబడకుండా వారితో సంప్రదింపులు జరపకుండా దళాలకు దళాలు తెలంగాణ పోలీస్ ల ముందు లొంగిపోతున్నారు.
👉 మహారాష్ట్ర సీఎం ముందు మల్లోజుల వేణుగోపాల్ !
కేంద్ర కమిటీ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ @ అభయ్, సోను దాదా, 2025 అక్టోబర్ లో మహారాష్ట్ర సీఎం ఫండవిస్ ముందు 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే వేణుగోపాల్ భార్య తార, 2025 జనవరిలో ఈ ప్రాంతంలో లొంగి ప్రభుత్వంతో వేణు లొంగుబాటుకు మధ్యవర్తిత్వం వహించిందని చర్చ ఉంది
👉 చత్తీస్గడ్ సీఎం ముందు.. ఆశన్న !
కేంద్ర కమిటీ సభ్యుడు తక్కల్లపల్లి వాసుదేవరావు @ ఆశన్న బీజాపూర్ ప్రాంతానికి చెందిన దాదాపు 200 మంది దళ సభ్యులతో ఛత్తీస్గడ్ సీఎం ఉంది 2025 అక్టోబర్ లొంగిపోయారు. వేణుతోపాటు ఆశన్న లొంగుబాటుకు ముందు మహారాష్ట్ర చత్తీస్గడ్ ప్రభుత్వాల రాడార్ కు వెళ్లి సంప్రదింపులు అనంతరమే లొంగినట్టు చర్చ.
👉 అసమాన ధైర్య సాహసాలకు తెలంగాణ పోలీసులు !
తెలంగాణ పోలీసులు అసమాన ధైర్యసహసాలతో ప్రాణ త్యాగాల చేసి ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేశారు అనే చిరస్థాయి చరిత్ర ఉంది.
దీంతోపాటు దేశంలోనే మొదటిసారిగా 2004 లో నక్సలైట్లతో శాంతి చర్చలను వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. చెన్నారెడ్డి ప్రభుత్వంలోనూ నక్సలైట్లు సభలకు సమావేశాలకు వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టు ఉద్యమంలో తెలంగాణకు చెందిన వారే కీలకం కావడంతో సీనియర్ పోలీస్ అధికారులు, ఇంటిలిజెన్సీ విభాగం ఆచితూచి మధ్యవర్తులతో వారికి నమ్మకం కలిగించేలా చర్చలు జరిపి లొంగుబాటుకు మార్గం సులభతరం చేశారు చేస్తున్నారనే ప్రశంసలు తెలంగాణ పోలీస్ యంత్రాంగంపై వెల్లువెత్తుతున్నాయి..
