👉 మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి !
J.SURENDER KUMAR,
మున్సిపల్ ఎన్నికల్లో వందకు వంద శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ….
రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు పాజిటివ్ గా ఉన్నారని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 100శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు.

తన రాజకీయ అనుభవం లో అధికార పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇలాంటి పాజిటివ్ ఉండడం అరుదు అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదని మంత్రి ఉత్తమ్ అన్నారు.

పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ పై మంత్రి స్పందించారు. రెబల్స్ పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుందని బిజెపి చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు.
