👉 ఈ నెల 15 నుండి 18 వరకు….
J.SURENDER KUMAR
లోక శాంతి కై ఈనెల 15 శివరాత్రి నుండి 18 వరకు విదర్భ ప్రాంతం లోని అష్ట వినాయకుల సన్నిధి లో 113 వ నుండి 118వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకాలు జరపనున్నామని అభిషేక సమన్వయకర్తలు వినోద్ కుమార్ మహావాది, సుభాష్ పనకంటి తెలిపారు.

👉 15 ఆదివారం శివరాత్రి నాడు ఉదయం 7.00 గంటల కు వార్ధ జిల్లాలోని వార్ధ నది తీరమైన కేలజర్ గ్రామం లో వెలసిన వరద వినాయక్ (దీన్నే ఏకచక్ర వినాయక్ అంటారు ) వద్ద 113 వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం మరియు రుద్రాభిషేకం జరుగును.

అరణ్య వాస సమయాన భీముడు బకాసురున్ని సంహరించిన ప్రదేశం కేలజర్.తదుపరి 1.30 మధ్యాహ్ననం”” ఉజ్వాయ సొండేచ గినాతిల్ గణపతి ” ఎవత్మాల్ లో అభిషేకం నిర్వహించి. 5.00 గంటల వరకు గోధూళి ముహూర్తం లో “కలంబ్ “అనే గ్రామం ఎవత్మాల్ జిల్లా లోని ఛత్రవతి నదితీరం లో వెలసిన “చింతామణి గణపతి “వద్ద 114 వ గణపతి సహస్రం జరుగును.

మహారాష్ట్ర లోని 21 గణపతులలో చింతామణి ఒకటి. గౌతముని శాప విమోచన కై ఇంద్రుడు తపస్సు చేసి వినాయకున్ని దర్శించిన కదంబ వనమే నేటి కలంబ్. ఇచ్చట ప్రతి 12సంవత్సరాల కొక సారి గంగ వినాయకున్ని తాకి వెళ్ళిపోతుంది. అని గణేశ పురాణం లో ఉన్నది.

👉 16 సోమవారం వైన్ గంగా నదీతీరము, బ్రాస్ సిటీ గా ప్రసిద్ధి గాంచిన బండారా జిల్లాలోని “మేండా ” గ్రామాన వెలసిన “బృషుండ్ గణపతి “సన్నిధి లో ఉదయం 8.00 గంటల కు 115 వ గణపతి సహస్రం మరియు రుద్రాభిషేకం
తదుపరి ప్రదోష వేళ బండారా జిల్లా వైన్ గంగా తీరమైన “పౌని ” గ్రామంలో వెలసిన “సర్వతోభద్ర గణపతి “(పంచానన్ గణపతి )సన్నిధిలో 116 వ గణపతి సహస్రం జరుగును. పౌని గ్రామానికి విదర్భ కాశీ అని పేరు.

👉 17- మంగళవారం భద్రావతి చంద్రపూర్ జిల్లాలో గౌరాల గ్రామం లో వెలసిన వరద వినాయక్ వద్ద 117 వ గణపతి సహస్రం అభిషేకం తరువాత చాందా మహంకాళి దేవాలయం లో భోజనం చేసి వేములవాడ లో బస.
👉 18 బుధవారం రాజన్న దర్శనం చేసుకొని గంభీరావుపేట లో 118 వ గణపతి సహస్ర ఆవర్తన అభిషేకం నిర్వహించనున్నట్లు కార్యక్రమ సమన్వయకర్తలు వినోద్ కుమార్ మహావాది,
సుభాష్ పనకంటి తెలిపారు.
