👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు అత్యధిక మార్కులు సాధించి ₹2.2 కోట్ల నగదు బహుతులు సాధించాలని రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు.
శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ వారు ప్రతిభవంతులపై విద్యార్ధులను అందించే నగదు బహుమతి పోస్టర్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
శ్రీరామ్ లైఫ్ ఇన్యూరెన్స్ వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదుతున్న 10వ తరగతి విద్యార్ధులను ప్రోత్సాహించడానికి ₹ 2.2 కోట్ల నగదు బహుమతి అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు నగదు బహుమతి సాధించే విధంగా ర్యాంకులు సాధించాలని మంత్రి విద్యార్ధులకు పిలుపునిచ్చారు.
👉 రాష్ర్ట స్థాయిలో స్టేట్ ఫస్ట్ పొందిన విద్యార్ధికి ₹ 5 లక్షలు, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్ధికి ₹ 3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్కు ₹2 లక్షలు, రాష్ర్టంలోని 119 నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గ టాపర్కు ₹ లక్ష, రాష్ర్టంలోని 612 మండలాలో ప్రధమ స్థానాన్ని పొందిన విద్యార్ధులకు ₹10వేలచొప్పులన నగదు బహుమతి అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు మంత్రి కి వివరించారు.
