విజేతలకు బహుమతులు అందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

వెల్గటూర్ మండలం స్తంభం పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీలో గెలుపొందిన విజేతలకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్  బహుమతులు అందజేశారు.

ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

👉  బ్రహోత్సవాలకు రండి !

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల – కోనాపూర్ లోని శ్రీదుబ్బ రాజేశ్వర స్వామి వార్షిక బ్రహోత్సవాలకు హాజరుకావాలని ఆలయ కమిటి సభ్యులు మంగళవారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ర్ట  ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఆహ్వాన పత్రిక అందించారు.

కోరిన కోర్కెలు తీర్చే శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి  వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13  నుంచి 17 వరకు నిర్వహిస్తుమని బ్రహ్మోత్సవాలకు తప్పకుండ హాజరు కావాలని మంత్రి ని కమిటి సభ్యులు కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి  దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.