ఎన్నికలకు సహకరించిన వారికి ధన్యవాదాలు !

👉 జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య !

J.SURENDER KUMAR,

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ తో పాటు జిల్లా యంత్రంగానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తదితరులకు నందయ్య కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వంతో సహకరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో ప్రధాన పాత్ర వహించి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో భాగస్వామ్యమైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలోని జగిత్యాల, రాయికల్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో జగిత్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి పాటుపడతారని ఆకాంక్షిస్తున్నట్లు నందయ్య తెలిపారు.