J SURENDER KUMAR,
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన ధర్మపురి మున్సిపల్ ఎన్నికలలో నేను ఎక్కడ, ఈ సందర్భంలోనూ, ఏ ప్రచార సభలోను ఎన్నికల కమిషన్ అమలుపరిచిన ఎన్నికల కోడ్ ను ఉల్లంగించలేదు, అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం లో మాట్లాడారు..
👉 మంత్రి మాటలలో….
ఓఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ లో ప్రచారం అయినా నేను ఎన్నికల కోడ్ అతిక్రమించినట్టు వార్త పూర్తి అవాస్తవం అన్నారు.
👉 ధర్మపురిలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆధ్యాత్మిక, భగవత సప్తాహం కార్యక్రమానికి, నిర్వాహకులు, ఆహ్వానిస్తే..వెళ్ళాను సప్తహ ప్రవచకులు బ్రహ్మశ్రీ సోమవేదం షణ్ముఖ శర్మ, డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి లను దర్శించుకున్నానని మంత్రి అన్నారు.
👉 ఈ నేపథ్యంలో కొందరు కాన్వాయ్ వీడియోలు తీసి, తప్పుడు ప్రచారం చేశారు అన్నారు.
👉 మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ముందే ఊహించి, బీఆర్ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు..
👉 తాను ఉపయోగిస్తున్న వాహనానికి ప్రతి కిలో మీటర్కు ₹ 61 చెల్లిస్తున్నానని, ఇటీవల మేడారంలో జరిగిన సంఘటన నేపథ్యంలోనే పోలీసులు భద్రత పరమైన చర్యలు తీసుకున్నారని మంత్రి పేర్నొన్నారు.
