👉 పూర్తి చేయకుంటే అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి !
👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !
J SURENDER KUMAR,
పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులకు డెడ్ లైన్ పెట్టండి…. అప్పటి వరకు పూర్తి చేయకపోతే అధికారులకు షో కాజ్ నోటీ సులు జారీ చేసి శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. మహాదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
👉 కాళేశ్వరం నుంచి పలుగుల వరకు ₹ 22 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే 7 కిలోమీటర్ల డబుల్ బీటీ రోడ్డు పనులకు, అదేవిధంగా కాళేశ్వరంలో ₹ 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మ్యూజియం పనులకు, ఆది ముక్తేశ్వర దేవస్థానం నుండి సరస్వతి ఘాట్ వరకు ₹2 కోట్ల 38 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, ₹ 1 కోటి 55 లక్షల రూపాయలతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని మంత్రి ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా కాళేశ్వరం మరియు అన్నారం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.
👉 అనంతరం కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలు మరియు రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమైన సమావేశానికి ఎస్‌ఈ స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మాకేం పని లేదనుకుంటున్నారా? పుష్కరాల కంటే ముఖ్యమైన పనులు ఏమి ఉన్నాయి?” అని అధికారులను ప్రశ్నించారు.
👉 పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనులను అధికారులు సమన్వయంతో మే మొదటి వారం వరకు వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక వసతులు, రోడ్లు, పారిశుధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
👉 బస్టాండ్ కు చెరువు స్థలం కేటాయించాలని సీసీఎల్ఏ తో ఫోన్ లో మాట్లాడి చెరువు మొత్తం ఎండి పోయింది, పంటలు కూడా సాగు చేయడం లేదు … కాబట్టి బస్ స్టాండ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సూచించారు.
👉 బస్ స్టాండ్ స్థలం గెజిట్ లేదు కదా ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారని అటవీ శాఖ అధికారులను అడిగిన తీసుకున్నారు. బస్ స్టాండ్ లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని, చెరువు సర్వే చేయాలని సూచించారు.
👉 ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ నిర్దేశించిన టైంలో గాని శాఖలు అధికారులు వారి కేటాయించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ధార్మిక సంస్థ సలహాదారుడు గోవింద హరి, ఎస్పీ సంకీర్త్, అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ, ఇరిగేషన్, విద్యుత్తు, పీఆర్, ఇరిగేషన్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
