J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ పరిధిలో వెల్గటూర్, ధర్మారం మండలాల్లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను బుధవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి స్వామివారాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు
వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట లో నాగపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, ధర్మారం మండలం కటికెనపల్లి లో శ్రీ లక్ష్మీ నరసింహ, దొంగతుర్తి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు..

ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు, మంత్రిని పూర్ణ కుంభంతో స్వాగతించి ఘనంగా ఆశీర్వదించారు. మంత్రికి స్వామివారి శేష వస్త్రం ప్రసాదం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ దొంగతుర్తి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఈప్రాంత ప్రజలపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
