👉 అసెంబ్లీలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ !
J.SURENDER KUMAR,
అసెంబ్లీ సమావేశాలలో మంగళవారం మాజీ మంత్రి హరీష్ రావు సభలో అసైన్డ్ భూముల గూర్చి మాట్లాడిన సందర్భంలో ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రసంగం లో…
👉 అధ్యక్ష,
గౌరవ సభ్యులు హరీష్ రావు మాట్లాడుతున్నారు. అసైన్డ్ ల్యాండ్స్ గురించి కానీ, దళితుల ల్యాండ్ల విషయం లో కానీ.. మాకు అత్యంత బాధాకరమైందేందంటే అధ్యక్ష కరీంనగర్ జిల్లా వాస్తవ్యులము.సిద్ధిపేట్ మీదుగానే పోతుంటాం .
👉 అధ్యక్ష.
మా లిడ్ క్యాప్, మా దళితులకు సంబంధించినటువంటి హక్కు. మా లిడ్ క్యాప్ భూములు వారి హయాంలో పోలీస్ డిపార్టుమెంటుకు సంబంధించిన అధికారులకు కట్టబెట్టి అక్కడ పోలీస్ కమిషనరేట్ కట్టిండ్రు.
👉 అధ్యక్ష.
ఆయన చర్చ పెడదాం అంటే అధ్యక్ష.. వీళ్ళు మొదటి నుంచి కూడా మీరు ఏదైతే ఉద్యమంలో నేపథ్యం ఉన్నటువంటి నుంచి.. మా దళితుల విషయం లో ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట ఎక్కడా కూడా అమలు చేయలేదు అధ్యక్ష ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో గానీ, మా లిడ్ క్యాప్ ల్యాండ్స్ విషయంలో గానీ, మా అసైన్డ్ ల్యాండ్ విషయంలో అధ్యక్ష.. అధ్యక్ష ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్తా
👉 అధ్యక్ష.
ధర్మారం అధ్యక్ష నా కాన్‌స్టిట్యూయెన్సీ
( నియోజకవర్గం) పుష్కునూరి రామారావు అని ఒక పెద్ద దొర అధ్యక్ష.. హైదరాబాదుకు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వచ్చేసిండు అధ్యక్ష .
👉 అధ్యక్ష,
ధరణి ద్వారా అధ్యక్ష ఏదైతే కబ్జాదార్ కాలంలో మా పేదవాళ్లు, దళితులు పాపం ఎన్కట వాళ్ళ తాతల దగ్గర సాదా కాగితం మీద రాసుకొని దుక్కు దున్నుకొని దానిమీద జీవనోపాధి చేస్తుంటే ధరణి రావడం వల్ల ఏదైతే అనుభవదార్ కాలమ్ ఎగిరిపోయి పట్టాదార్ కాలమ్ వచ్చినాక ఆయన హైదరాబాద్ కి వెళ్లి వచ్చి ఆ భూములన్నీ గుంజుకున్నారు అధ్యక్ష .
👉 అధ్యక్ష.
మా పేదవాళ్ళ దగ్గరికెళ్లి. వాళ్ళ ప్రభుత్వ హయాంలో, వాళ్ళ సర్కార్ హయాంలో ఆ పేదల పక్షాన మేం రోడ్ల మీద కూర్చుంటే వారు ఏమంటున్నారంటే.. ‘మాకు పట్టాలో ఉన్నది, మాకు కాగితం ఉన్నది, మాకు ధరణి ద్వారా హక్కు వచ్చింది’ అని చెప్పి మెడలు పట్టి మమ్మల్ని బయటికి గెంటి వేశారు అధ్యక్ష .
👉 అధ్యక్ష..
ఇన్ని విధాల ఆ ప్రభుత్వంలో మా దళితులకు సంబంధించినటువంటి ఇందిరమ్మ తల్లి ఇచ్చినటువంటి భూముల విషయంలో, అసైన్డ్ పరంగా మా హక్కు విషయంలో. మా హక్కును ఆ ప్రభుత్వంలో ధరణితో మా కడుపు కొట్టి మా భూములను గుంజుకొని మా లిడ్ క్యాప్ భూములు అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తా.
👉 అధ్యక్ష
ఈ సభ ద్వారా.. మాకు ఎంత అన్యాయం జరిగిందో అధ్యక్ష నేను రుజువు చేస్తాను నేను సిద్ధంగా ఉన్నా అధ్యక్ష అంటూ మంత్రి ప్రసంగం ముగించారు
