అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే పై దౌర్జన్యం సహించం !

👉 కడియం శ్రీహరి ప్రసంగం సమయంలో కౌశిక్ రెడ్డి అహంకార ధోరణి సరి కాదు !


👉 దళితుల గౌరవాన్ని కించపరిచే చర్యలపై ఇకపై సహించేది లేదు !


👉 బీఆర్‌ఎస్ నాయకుల ఏకైక అజెండా – ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేయడమే వారి నైజం!


👉 అవినీతి వెలికితీతకు హౌస్ కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు చేపడతాం !

👉 అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం !

J.SURENDER KUMAR,

రాష్ట్ర శాసనసభలో దళిత ఎమ్మెల్యేల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, చిటికెలు కొడుతూ, చేతులు చూపిస్తూ బెదిరింపులకు దిగడం అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని మంత్రి మండిపడ్డారు.


👉 దళితులపై ఈ విధమైన దౌర్జన్యం ఎన్ని రోజులు కొనసాగుతుంది ? అంటూ ప్రశ్నించిన మంత్రి, ప్రజలు గమనిస్తున్నారని, ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.


👉 గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయిన మా అన్న సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై తీసుకున్న చర్యలను గుర్తుచేస్తూ, సభా మర్యాదలు అందరికీ సమానమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలను దూరం చేసి, ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క హోదాను తగ్గించిన విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.


👉 ప్రస్తుతం బీఆర్‌ఎస్ నాయకులు ఒకే అజెండాతో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ను లక్ష్యంగా చేసుకోవడం తగదని అన్నారు.


👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత 10 ఏళ్ల అవినీతి పై సీబీసీఐడీ విచారణకు హౌస్ కమిటీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన అంశాలపై కూడా పారదర్శకంగా విచారణకు సిద్ధమని వెల్లడించారు.


👉 ప్రజలే తమకు అధికారాన్ని ఇచ్చారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ప్రజల మద్దతు కొనసాగుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.


👉 అసెంబ్లీలో ప్రస్తుతం చర్చిస్తున్న వృద్ధుల సంక్షేమ బిల్లును కూడా ప్రతిపక్షం పట్టించుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పరిస్థితులను అరికట్టేందుకు ఈ బిల్లు కీలకమని చెప్పారు.


👉 మొత్తానికి, దళితుల గౌరవాన్ని కాపాడటంలో ప్రభుత్వం రాజీ పడదని, అసెంబ్లీలో అనుచిత ప్రవర్తనపై కఠిన చర్యలు తప్పవని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.