👉 మాజీమంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో..
👉 పార్టీ వీడకండి క్యాబినెట్ మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ ల అభ్యర్థన !
J.SURENDER KUMAR,
గత కొన్ని నెలలుగా జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశం లో కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర అధిష్టానం కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా బుజ్జగింపు చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
జీవన్ రెడ్డితో చర్చించి, మెప్పించి, ఒప్పించే ఆయన సమకాలిక నాయకులు పార్టీలో ఒక్కరిద్దరు ఉన్న, క్యాబినెట్ మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ లను అధిష్టానం దూతలుగా చివరిసారిగా శనివారం పంపింది.
జీవన్ రెడ్డి తన నిర్ణయంలో మార్పు ఉండదని స్పష్టం చేయడంతో, అయినాను అస్తినకు పోయి రావలెను అనే తరహాలో మరోసారి బుజ్జగింపు ప్రయత్నాలకు అధిష్టానం ముగింపు పలికినట్టు సమాచారం.
👉 పార్టీలో అపార గౌరవం !
కాంగ్రెస్ పార్టీలో భీష్మాచార్యుడి గా మాజీమంత్రి జీవన్ రెడ్డి పట్ల పార్టీ అగ్రనాయకత్వం మొదలుకొని, గ్రామస్థాయి కార్యకర్త వరకు ఆయన పట్ల అపార గౌరవం ఉందనేది జగమెరిగిన సత్యం.. అవినీతికి ఆరోపణలకు దూరం. కుటుంబ సభ్యులను రాజకీయాల్లో ప్రోత్సహించకపోవడం రైతు గ్రామీణ సమస్యల పట్ల రాజీలేని పోరాట పటిమ జీవన్ రెడ్డి ప్రత్యేకత..
మంత్రి శ్రీధర్ బాబు, తండ్రి స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు సమకాలీకుడు జీవన్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కుమార్ గెలుపు, ఓటములు సందర్భంగా మానసిక ధైర్యాన్ని కల్పిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఉండాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ప్రోత్సహించిన నాయకుడు జీవన్ రెడ్డి అనేది అంగీకరించాల్సిన విషయం..
👉 గౌరవానికి భంగం కలగకుండా..
గత 20 నెలలుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ , జీవన్ రెడ్డి మధ్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య ఆరోపణల పోరులో మంత్రి లక్ష్మణ్ కుమార్ మానసిక వేదన చెందుతున్నారు అనేది సత్యం.. గతంలోకాంగ్రెస్ నాయకుడి హత్య, నామినేటెడ్ పోస్టుల నియామకంలో, మున్సిపల్ ఎన్నికల బీఫామ్ పంపిణీలో జీవన్ రెడ్డి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలతోపాటు , పలు సందర్భాలలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన, జీవన్ రెడ్డికి ఎదురు మాట్లాడకుండా సార్ , సార్, అంటూ మౌనం వహిస్తూ మానసికంగా నలిగిపోయారు.. కొన్ని సందర్భాల్లో మంత్రి శ్రీధర్ బాబు పై ఆగ్రహం వ్యక్తం చేసిన మౌనమే తప్ప జీవన్ రెడ్డి ముందు మరో మాట మాట్లాడలేదు అనేది తెలిసిందే..
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్, ఏఐసీసీ పరిశీలకుడు కత్తి వెంకటస్వామి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డి తో అనేకసార్లు బుజ్జగింపు సంప్రదింపులు జరిపిన ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపులకు పులిస్టాప్ పెట్టినట్టు సమాచారం..
