బలగం సినీ నటుడు నారాయణ భార్య శశికళ మృతి !

J.SURENDER KUMAR,

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీకి చెందిన మాజీ వార్డు సభ్యురాలు, బలగం సినిమా నటుడు మురళీధర్ గౌడ్ (బలగం నారాయణ) భార్య  శశికళ అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. గతంలో రామయంపేట  గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో  వార్డు సభ్యురాలిగా విశేషమైన సేవలు అందించారు..

ఆమె  మృతి పట్ల రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా, మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాదగిరి, విండో మాజీ చైర్మన్ బాధే చంద్రం, లక్ష్మాపూర్ సర్పంచ్, మండల బిజెపి అధ్యక్షుడు  గోళ్ళపల్లి నవీన్ గౌడ్, టీయూడబ్ల్యూజే (ఐజేయు )రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.జి. శ్రీనివాస శర్మ. రామయంపేట  అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి పటేరి రాము
జిల్లా కోశాధికారి వూడెం దేవరాజు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, తో పాటు వివిధ పార్టీల నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు
..