👉 మల్లోజ్జుల వేణుగోపాల్ రావు @ అభయ్@ సోను దాదా, ఆదివారం పెద్దపల్లిలో సొంత ఇంటికి వచ్చారు !
👉 46 సంవత్సరాలు విప్లవ పంథాలో కొనసాగిన ఆయన గత అక్టోబర్ లో సాయుధ విరమణ ప్రకటించారు !
👉 సుప్రీం బాస్ ముప్పాల లక్ష్మణరావు @ గణపతి రాక కోసం బంధువులు, గుట్ట కింది ప్రజలు !
J.SURENDER KUMAR,
నాలుగున్నర దశాబ్దాల అజ్ఞాత జీవితం. బందూకులతో, మమేకమై ముప్పావు జీవితం అడవుల్లో కోల్పోయి చరమాంక దశలో బంధువుల, రక్తసంబంధీకుల తోడు కోసం తహ తహ లాడుతున్నాయి, తపించిపోతున్నాయి..
భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిని నిర్మూలన కోసం ఉరకలు పెడుతున్న యువ వయసులో బందూకు చేత పట్టి అడవి బాట పట్టిన అన్నలు, మావోయిస్టు అగ్ర నాయకులు అలసిపోయారు.
మారిన పరిస్థితులు, భారత ప్రభుత్వ దృఢ విధానాలు, మీద పడిన వయస్సు అన్నీ కలిసి ప్రజాస్వామ్య భారతoలో తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించలేము అనేది నిర్ధారించుకొని వారు జనజీవన స్రవంతిలో చేరడం సమాజానికి శుభ పరిణామం.
ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాలు మాయమై ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలుగా మారిన ఈ తరుణంలో మానవ సంబంధాల కోసం మదనపడుతున్న మావోయిస్టులు, అగ్రనేతలు నాయకులు సమాజానికి మార్గదర్శకులు అవుతారు కాబోలు..
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి,@ దేవుజీ @ కుమ్మా దాదా, (44 సంవత్సరాలు అజ్ఞాతం) కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి @ సంగ్రామం.(46 సంవత్సరాల అజ్ఞాతం) తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) కార్యదర్శి బడే చొక్కారావు,@ దామోదర్,@ జగన్ (28 సంవత్సరాల అజ్ఞాతం) రాష్ట్ర కమిటీ సభ్యుడు (SCM) నూనె నర్సింహా రెడ్డి @గంగన్న ,@ సన్ను దాదా.(36 సంవత్సరాల అజ్ఞాతం) వీరితోపాటు మరో 40 మంది కీలక మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిన విషయం విధితమే.
👉మల్లోజుల వేణుగోపాల్ రావు @ అభయ్ !
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా, పొలిట్ బ్యూరో మెంబర్ గా పని చేసి జనజీవనంలోకి వచ్చిన మల్లోజ్జుల వేణుగోపాల్ రావు, ఆయన భార్య తార తో కలసి పెద్దపల్లికి వచ్చారు. నాలుగన్నర దశాబ్దాలుగా విప్లవ పంథాలో కొనసాగిన ఆయన గత ఆగస్టు నెలలో సాయుధ విరమణ ప్రకటించారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందు ఆయన భార్య తార 2025 జనవరిలో వేణుగోపాలరావు గత అక్టోబర్ లో జనజీవనంలోకి వచ్చిన వారు గడ్చిరోలికే పరిమితం అయ్యారు.
వేణుగోపాల్ రావు స్వస్థలం అయిన పెద్దపల్లికి ఎప్పుడు వస్తారోనన్న ఆతృత స్థానికంగా కనిపించింది. అయితే ఆదివారం ఆయన సోదరుడు అంజన్న అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం అందుకున్న వేణుగోపాల్ రావు పెద్దపల్లిలోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన బంధువులు, పరిచయస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు.
👉 46 సంవత్సరాల తర్వాత…

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం విప్లవ పాఠాలు నేర్పుతూ స్థానిక యువతను ఉద్యమాల వైపునకు నడిపించిన మల్లోజ్జుల ఇంతకాలం బాహాటంగా తిరిగిన సందర్భాలు అత్యంత అరుదేనని చెప్పాలి. దండకారణ్య అటవీ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన ఆయన తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని దాదాపుగా దూరం చేసుకున్నట్టయింది. మావోయిస్టులకు సంబంధించిన ఘటనలు జరిగినప్పుడు మాత్రం వేణుగోపాల్ రావు గురించి చర్చకు వచ్చేది. 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన సోదరుడు మల్లోజ్జుల కోటేశ్వర్ రావు ఎన్ కౌంటర్ లో చనిపోయిన తరువాత వేణుగోపాల్ రావు గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఆయన తల్లి మధురమ్మ జనజీవనంలోకి రావాలన్న పిలుపుపై నాడు స్పందించని వేణుగోపాల్ రావు. ఆ తరువాత ఆయన ఆయుధ విరమణ ప్రకటించిన తరువాత బయటకు వచ్చినప్పటికీ కన్నతల్లిని చూడలేకపోయారు.. మహారాష్ట్రలోని గడ్చిరోలికే పరిమితం అయ్యారు. ఆదివారం పెద్దపల్లికి వేణుగోపాల్ రావు చేరుకోవడంతో సుదీర్ఘ కాలం తరువాత సొంత ఇంటికి వచ్చినట్టయింది.
👉 ముందస్తుగా పెద్దపల్లికి మహారాష్ట్ర మఫ్టీ పోలీసులు ?
మల్లోజ్జుల వేణుగోపాల్ రావు, పెద్దపల్లి పర్యటన అంతా కూడా మహారాష్ట్ర పోలీసుల కనుసన్నల్లోనే సాగింది. మహారాష్ట్ర డిజిపి శనివారం తెలంగాణ డిజిపి కి వేణుగోపాల్ రావు రాక గూర్చి సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ముందస్తుగా మహారాష్ట్ర మఫ్టీ పోలీసులు పెద్దపల్లికి చేరుకున్నట్టు సమాచారం.
వేణుగోపాలరావు వెన్నంటి మఫ్టీ పోలీసులు ఉంటూ సునిశితంగా పరిశీలన చేశారు. కుటుంబ సభ్యులతో కలిసిన ఆయన నవ్వకుంటూ పరిచయం చేసుకోగా తన చిన్ననాటి తరానికి చెందిన వారిని ముచ్చటించారు. అయితే వేణుగోపాల్ రావు మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇంటర్వ్యూల కోసం గడ్చిరోలికి రావాలని ఇక్కడ మీడియాతో మాట్లాడనని ఆయన స్షష్టం చేశారు.
👉 గణపతి రాక కోసం….

మావోయిస్టు సుప్రీం చీఫ్, మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ముప్పాల లక్ష్మణరావు @ గణపతి రాక కోసం ఆయన బంధు వర్గంతో పాటు, గుట్ట కింద గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు..
అనారోగ్య సమస్యలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్వగ్రామం బీర్పూర్ కు గుర్తింపు, తదితర అంశాల నేపథ్యంలో సహచర అగ్ర నేతలు లొంగిన తరహాలోనే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి లొంగి జనజీవన స్రవంతిలో కి రావాలి అని బంధువులు, ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
