J.SURENDER KUMAR,
సోమవారం నుండి ప్రారంభం కాదన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.
.
గొల్లపల్లి మండలం వెనుగుమట్ల – బొంకూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈసందర్భంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో మంత్రి కి స్వాగతం పలికారు. మంత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఈనెల 23 నుండి 25వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
👉 ఆయిల్ ఫామ్ కర్మాగార ప్రారంభోత్సవానికి తరలి వెళ్లిన రైతాంగం !

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి ధర్మపురి నియోజకవర్గం నుంచి పలువురు రైతులు ఆదివారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జెండా ఊపి ప్రత్యేక బస్సులను నర్మెట్టకు సాగనంపారు.
