👉 టీచర్ ట్రైనింగ్ కు భార్యతో కలిసి అద్దె ఇంటిలో..
J.SURENDER KUMAR ,
రేపో, మాపో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలకో, లొంగనున్నట్టు ప్రచారం జరుగుతున్న మావోయిస్టు అగ్రనేత గణపతి తన భార్య తో కలిసి హనుమకొండలో అద్దె ఇంటిలో ఉంటూ టీచర్ ట్రైనింగ్ తరగతు లకు హాజరయ్యారు.
ముప్పాల లక్ష్మణరావు @ గణపతి సైన్స్ గ్రాడ్యుయేట్ (బిఎస్సి) నాడు టీచర్ ట్రైనింగ్ లేకుండా ఉపాధ్యాయ వృత్తికి ఎంపికయ్యారు. మొదటి పోస్టింగ్ ప్రస్తుతం మండల కేంద్రమైన ఎలిగేడు ప్రభుత్వ పాఠశాలలో విధుల్లో చేరారు. ఎలిగేడు సమీప గ్రామమైన రాగినేడు కు చెందిన విజయతో కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం ను గణపతి చేసుకున్నాడు .
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారం పాఠశాలకు బదిలీ అయిన గణపతి టీచర్ ట్రైనింగ్ కోసం భార్యతో కలిసి వరంగల్ వెళ్లారు. హనుమకొండలో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ టీచర్ ట్రైనింగ్ తరగతులకు హాజరయ్యేవారు.

గణపతి భార్య వైద్య పరీక్షల తో పాటు కొన్ని రోజులపాటు విశ్రాంతి కోసం తన తల్లి గారి ఇంటికి వెళ్ళింది. బీర్పూర్ గ్రామానికి చెందిన గణపతి సమీప బంధువు అవసర నిమిత్తం వరంగల్ కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే గణపతి ఉంటున్న ఇంటిలో పౌర హక్కుల నాయకుల, వరవరరావులతో సమావేశాలు, చర్చలు జరుగుతుండేవి కొన్ని నెలలకే గణపతి అజ్ఞాతవాసం పట్టారు.
