భద్రాచల బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం !

J SURENDER KUMAR,

ఈ నెల 27 న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ  ప్రతినిధులు, ఆలయ అర్చకులు గురువారం ముఖ్యమంత్రి ని కలిసి ఆహ్వానం అందించారు.  

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీమతి కొండా సురేఖ , తుమ్మల నాగేశ్వర రావు,  పొంగులేటి శ్రీనివాస రెడ్డి , రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు , ఆలయ ఈవో దామోదర్ రావు  ఉన్నారు.

👉 ప్రజాపాలనలో రైతు ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం !

ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు  ముఖ్యమంత్రి ని కలిసి ఆ మేరకు ఆహ్వానాన్ని అందించారు.

ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యాచరణలో భాగంగా ఈ నాలుగు రోజుల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజులపాటు “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 22న సిద్ధిపేట జిల్లా  నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగాన్ని ముఖ్యమంత్రి  చేతుల మీదుగా ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నారు. దానికి సమీపంలో ₹ 80 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి  స్థానిక రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడిన అనంతరం తొలివిడత రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.