👉 .ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ధర్మపురి బ్రాహ్మణ సంఘం!
J.SURENDER KUMAR,
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఈ నెల 12న వైదిక ఆశీర్వచనాలు చేసిన బ్రాహ్మణులను ఉద్దేశించి, బ్రాహ్మణ జాతిని అవమానించే రీతిలో, అసభ్య పరుష పదజాలం వాడిన నేపథ్యంలో సామెల్ వ్యాఖ్యలను ధర్మపురి బ్రాహ్మణ సంఘం తీవ్రంగా ఖండించింది.
రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ, పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఆశీర్వచన వ్యాఖ్యానాలను అవమానకరంగా మాట్లాడిన విషయం తెలిసిందే.
ధర్మపురి పట్టణంలోని నంది విగ్రహం వద్ద ఆదివారం ధర్మపురి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు..
👉 నిరసన కార్యక్రమంలో…
శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్న సత్రం అధ్యక్షులు దత్తాత్రి కొరిడె మాట్లాడుతూ….
..బ్రాహ్మణులు అనునిత్యం నిస్వార్థంగా…లోకాః సమస్తా సుఖినో భవంతు అని కోరుకుంటారని, వేద కాలం నుండి సమాజ శ్రేయస్సుకు అంకితం అయినారని గుర్తు చేశారు.
బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య మాట్లాడుతూ..
.బ్రాహ్మణ పురోహితులు లేకుండా శుభ కార్యాలు జరగవంటే అతిశయోక్తి కాదన్నారు. ఎమ్మెల్యే సామ్యూల్ బ్రాహ్మణులను, హిందూ సంస్కృతిని కించ పరచడాన్ని ఖండించారు.
కొరిడె రమాదేవి పౌరాణికులు మాట్లాడుతూ…
బ్రాహ్మణ వేద మూర్తులు సమాజ హుతులని, వారికి కోపం వస్తే పెట్టే శాపానికి తిరుగులేదని పురాణాలు స్పష్టం చేస్తున్నాయని ..బ్రాహ్మణ కులం కాదు..వ్యవస్త అని వివరించారు.
మున్సిపల్ కౌన్సిలర్ సంగన భట్ల సంతోషీ మాట్లాడుతూ…
వేద పండితులు బ్రాహ్మణులు పురోహితులని అంటే పుర హితులు ప్రజల హితం, తప్ప నష్టం కోరే వారు కాదన్నారు.
బ్రాహ్మణ సంఘం, శారదా మహిళా మండలి, గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్న సత్రం, అన్నపూర్ణ సేవా సమితి బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.
