బీఆర్ఎస్ పాలన లో ప్రభుత్వ భూములు కబ్జా చేశారు !

👉 ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేస్తాం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనర్హులైన కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని  వారు ఎంతటి వారైనా వారి నుండి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఆదివారం ఇంటింటికి సోలార్ పథకం పై జరిగిన అవగాహన కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, ఖీలావనపర్తి , ధర్మారం గ్రామంలో కొందరు ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి పట్టాలు రద్దు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు అందజేస్తామని మంత్రి తెలిపారు.

ధర్మారం మండల కేంద్రంలో క్రీడా మైదానం కొరకు కేటాయించిన  స్థలాన్ని 15 రోజుల్లో చదును చేసి క్రికెట్, వాలీబాల్ ,వాకింగ్ ట్రాక్ కు అనుగుణంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులకు సూచించారు.

రాజకీయంగా జన్మనిచ్చిన ధర్మారం మండలం పై ప్రత్యేక ప్రేమ ఉంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ప్రభుత్వం అందజేస్తున్న సోలార్ పథకాన్ని నంది మేడారం గ్రామస్తులు 100 శాతం  ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  చోరవతో మేడారం గ్రామం 100శాతం సోలార్ గ్రామంలో ఎంపిక అయిందని మంత్రి వివరించారు.

గ్రామంలో తొలి విడతలో గృహ అవసరాలకు 1486 విద్యుత్ కనెక్షన్లు కు రెండు కిలో వాట్స్ సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండవ విడతలో 628 కరెంట్ వ్యవసాయ పెంపు సెట్లకు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

మేడారం గ్రామాన్ని 100 శాతం సోలార్ వినియోగం గ్రామంగా మార్చడానికి ప్రభుత్వం ₹ 51 కోట్లు విడుదల చేసిందని మంత్రి తెలిపారు.

గ్రామంలో విద్యుత్తు లైన్ల మార్పిడి కోసం ₹ 36 లక్షలు కేటాయించడం మంత్రి వివరించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా బోర్ బావులు తవ్వించామని 80 మందికి మేడారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.