J.SURENDER KUMAR,
టీ 20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
అహ్మదాబాద్‌లో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించింది. ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు భారత జట్టు సమన్వయంతో, ధైర్యసాహసాలతో ఆడుతూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిందని ప్రశంసించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు.

టీమ్ ఇండియా సాధించిన విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని అన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు టీమ్ సభ్యులందరికీ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
