J SURENDER KUMAR,
UPSC సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ ఫైనల్స్ లో తెలంగాణ నుంచి మంచి ఫలితాలు సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
👉 సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తోంది.
👉 సింగరేణి సంస్థ అధ్వర్యంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.
👉 ఇంటర్వ్యూకి హాజరైన వారిలో 20 మంది సివిల్స్ తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలిచారు. రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
