👉 ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ , జవాబు దారితనం మరియు పర్యవేక్షణ బిల్లు ఆమోదం సందర్భంగా ..
J.SURENDER KUMAR,
తల్లిదండ్రుల సంరక్షణకు చట్టబద్ధ బలం కల్పించే కీలక బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు ఆదివారం అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలసి సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో మహిళా మరియు శిశు సంక్షేమ కార్యదర్శి అనితా రామచంద్రన్, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో ఆమోదం పొందిన “తెలంగాణ ఉద్యోగుల బాధ్యత – తల్లిదండ్రుల సంరక్షణ పర్యవేక్షణ బిల్లు–2026” ను వృద్ధుల సంక్షేమానికి చారిత్రాత్మక నిర్ణయంగా మంత్రి అభివర్ణించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

తల్లిదండ్రులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తుచేసేలా ఈ చట్టం రూపొందించామని తెలిపారు. కుటుంబ విలువలు క్షీణిస్తున్న నేపథ్యంలో వాటికి చట్టబద్ధ బలం ఇవ్వడం అవసరమైందని చెప్పారు.
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి, సామాజిక బాధ్యతతో ఈ బిల్లు సాధ్యమైందని కొనియాడారు.
👉 ఈ చట్టం అమలుతో వృద్ధులపై నిర్లక్ష్యానికి చెక్ పడటమే కాకుండా, వారి సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

.👉 వృద్ధుల గౌరవాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో బాధ్యతాయుత ధోరణిని పెంపొందించే దిశగా కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
