దళితుల హక్కుల సాధనలో కాంగ్రెస్ పార్టీది కీలక పాత్ర !

👉 దళిత యువతి, యువకులకు, విద్య, ఉపాధిలో కాంగ్రెస్ అండ !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

దళితుల హక్కులు, సాధన, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తు కీలక పాత్ర  పోషిస్తున్నదని ,రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్‌గా డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం సందర్భంగా గురువారం గాంధీభవన్ లో జరిగింది..


👉 ఈ సభలో మంత్రి  లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

శాసనసభ్యులు  డా. కవ్వంపల్లి సత్యనారాయణకు ఈ బాధ్యతలు రావడం పార్టీకి మాత్రమే కాకుండా దళిత సమాజానికి కూడా గర్వకారణమని పేర్కొన్నారు.

👉 ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.

👉 ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు ద్వారా దళిత సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

👉 డా. కవ్వంపల్లి సత్యనారాయణ తన అనుభవంతో పార్టీని బలోపేతం చేస్తూ ఎస్సీ సమాజ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

👉 గ్రామం నుంచి మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు ఎస్సీ సెల్‌ను బలోపేతం చేసి దళితుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు.

👉 దళిత యువత విద్య, ఉపాధి, రాజకీయాల్లో ముందుకు రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.

👉 తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో దళితుల పాత్ర కీలకమని, ఎస్సీ సెల్ విభాగాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు తాను మంత్రిగా ఎల్లప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు.

👉 ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న తాను మంత్రిగా బాధ్యతలు చేపడతానని ఎప్పుడూ ఊహించలేదని మంత్రి చెప్పారు. పార్టీ నాయకులు, సహచరుల సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తుచేశారు. రిజర్వేషన్ల ద్వారా లభించిన హక్కులను సాధించుకునేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అందరూ కృషి చేయాలని సూచించారు.

👉 పేద వర్గాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రతి వారం మూడు రోజులు రాష్ట్ర సచివాలయంలో ఉంటానని మంత్రి తెలిపారు.

👉 గురుకుల సీట్లు లేదా ఇతర సమస్యల విషయంలో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే తనను సంప్రదించాలని, అన్నలా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. చివరిగా, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణను  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌగిలించుకొని  శుభాకాంక్షలు తెలిపారు.