ధర్మపురిలో అత్యవసర పనుల కోసం నిధులు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో !

J.SURENDER KUMAR

ధర్మపురి పట్టణంలో పలు అత్యవసర అభివృద్ధి పనుల కోసం మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ₹ 30 లక్షలనిధులు మంజూరు చేశారు.

పట్టణంలోని మెయిన్ (కమలాపూర్ ఫీడర్) రోడ్డులో ఇండ్ల మీదుగా వెళుతున్న 11 కేవీ విద్యుత్ వైర్ల షిఫ్టింగ్ కోసం ₹10 లక్షలు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సంపు బ్రహ్మ గుండం నుండి నీరు నింపడం మరియు వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ కోసం ₹ 8 లక్షలు మంజూరు చేశారు.


అదే విధంగా డిగ్రీ కాలేజీలో తరగతులు ప్రారంభం అవుతున్న సందర్భంగా కాలేజీకి సంబంధించిన రూముల మరమ్మతుల కోసం ₹ 12 లక్షలు మంజూరు చేయించారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు !

అత్యవసర అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి,  వైస్ చైర్ పర్సన్ ఇందారపు రామన్న గ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్  M శ్రీనివాస్ రావు  కృతజ్ఞతలు తెలిపారు.