ధర్మపురి నరసింహుడి కళ్యాణానికి పోటెత్తిన భక్తజనం!

👉 స్వామి వారి కళ్యాణం తిలకించడానికి భక్తజనంకు కుర్చీలు , మినరల్ వాటర్ బాటిల్లు !

👉 డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ప్రత్యక్ష వ్యాఖ్యానంతో పరవశించిన భక్తజనం !

J.SURENDER KUMAR,

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం గోదావరి నది తీరంలో శ్రీ మఠం స్వామి మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణం తిలకించడానికి తరలివచ్చిన భక్తజనంతో ధర్మపురి క్షేత్రం పోటెత్తింది.

ఆలయ అర్చకులు వేద పండితులు, వేదమంత్రాల మంగళ వాయిద్యాలు ఘోషలో స్వామి వారి కళ్యాణం కన్నుల పండవగా జరిగింది.

👉 గత సంవత్సరం స్వామివారి కళ్యాణం తిలకించడానికి వచ్చినవెనకవైపు కూర్చున్న భక్తజనంకు ఇబ్బంది కలిగిందని గుర్తించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రతి భక్తుడు కూర్చుంది స్వామి వారి కళ్యాణం తెరిపించడానికి కుర్చీ సౌలభ్యం కల్పించారు. దాదాపు 8 వేల కుర్చీలు భక్తులకు అందుబాటులో ఉంచారు.

👉 అంబులెన్సులు, ఫైర్ ఇంజన్ మొబైల్ టాయిలెట్లు  వైద్య శిబిరాలు కళ్యాణ ప్రాంగణ పరిసరాల్లో అందుబాటులో ఉంచారు. భక్తుల సౌకర్యార్థం దాతలు అందించిన వేలాది మినరల్ వాటర్ బాటిల్ అందుబాటులో ఉంచారు.

👉 బాచంపల్లి ప్రత్యక్ష వ్యాఖ్యానం – పరవశించిన భక్తజనం !

ప్రముఖ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామి వారి కళ్యాణ వేదికపై ఆసీనులై  ధర్మపురి క్షేత్ర మహత్యం, గోదావరి నది ప్రాశస్యత స్వామివారి కల్యాణ విశిష్టత వివరించిన తీరు భక్తజనం పరవశింప చేసింది.

👉 నవ నరసింహ క్షేత్రాలలో ఒక్క ధర్మపురి క్షేత్రంలోనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం గోధూళి  ( సాయంత్రం వేళ) ముహూర్తంలో జరగడం విశేషం అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉద్భవించిన సమయం  కళ్యాణ సమయం ఒకటే కావడం ప్రత్యేకత అన్నారు.

👉 ధర్మపురి క్షేత్రంలో రామానుజ, అద్వైత, తదితర భేదభావం లేవని అనాదిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కళ్యాణం రోజున అర్చకుల ఇంట ఎదుర్కోళ్ల కార్యక్రమం, స్వామివారి రథోత్సవం అనంతరం స్వామివారి చక్రతీర్థం అనంతరం మధ్వాచారి వంశం వారి గృహాల్లో నాగవల్లి కార్యక్రమం జరుగుతుందని. నిత్యం స్వామి వారికి పంచుపనిషత్తులతో అభిషేకం జరగడం తదితర అంశాలను వివరిస్తూ ధర్మపురి క్షేత్ర విశిష్టతను వివరించారు.

👉 పవిత్ర ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనం, సామవేద షణ్ముఖ శర్మ భాగవత సప్తాహం, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వైభవం డాక్యుమెంటరీ మంత్రి లక్ష్మణ్ కుమార్ తనయుడు హరీష్ కుమార్ రూపకల్పన చేయడం. ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మపురి క్షేత్ర మహత్యాన్ని ప్రపంచ స్థాయిలో విస్తరింప చేశారని బాచంపల్లి ప్రశంసించారు.


👉శ్రీ శృంగేరి  శృంగేరి స్వామి ప్రియ శిష్యులు ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతులు గత కొన్ని రోజులుగా సిద్ధి పొందిన శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు తమ స్థలం స్వామి వారి కళ్యాణం కోసం వినియోగానికి ఇవ్వడం పట్ల స్వామివారికి బాచంపల్లి కృతజ్ఞతలు తెలిపారు.

👉 నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తుడు అగ్గు స్వామి లక్షలాది రూపాయల బంగారు ఆభరణాలు కళ్యాణ వేదికపై అర్చకులు వేద పండితులకు అందించారు. గత సంవత్సరం స్వామివారి కళ్యాణం లో బంగార. ఆభరణాలు స్వామివారికి అప్పగించారు.

👉 బ్రహ్మోత్సవాలలో భక్తులకు దాతల సహకారంతో 13 రోజులపాటు ఉచిత అన్నదానం నిర్వహించడం. అన్నదాన కార్యక్రమానికి మంత్రుల లక్ష్మణ్ కుమార్ ₹ 50వేల నగదు అందించడం అభినందనీయం అన్నారు.

👉 రాత్రి భక్తులకు భోజనాలు !

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం తిలకించడానికి సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాదిమంది భక్తజనంకు రాత్రివేళ టీటీడీ కళ్యాణమండపంలో భోజనాలు టిఫిన్ లను ఏర్పాటు చేశారు.

👉 స్వామి వారి కళ్యాణం తిలకించడానికి వచ్చిన భక్తులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ కంపార్ట్మెంట్ ల వారిగా తిరుగుతూ చేతులు జోడించి భక్తులను స్వాగతించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు ధాత, ఒగ్గు స్వామి మంత్రి లక్ష్మణ్ కుమార్ కాలింగ్ అనం చేసుకుని విఐపి గ్యాలరీకి తీసుకువచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు.

భక్తజనంకు ,వీఐపీలకు, స్థానికులకు, పాత్రికేయులకు, వాహనాలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు పకడ్బందీగా సేవలు అందించారు.