J.SURENDER KUMAR,
ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామినీ దర్శించుకొని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి నూతన సంవత్సరంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దయతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో పాడి పంటలతో రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
👉 చందయపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి !

ఉగాది పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం బుగ్గారం మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ పూజలు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
