డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పై…

👉 అసెంబ్లీలో మంత్రి అడ్లూరి ప్రసంగం!


J SURENDER KUMAR


రాష్ట్ర శాసనసభలో మంగళవారం ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సభ్యులు అడిగిన ప్రశ్నలకు, ప్రభుత్వానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి  పై  సమగ్ర వివరాలతో ప్రసంగించారు.

👉 మంత్రి ప్రసంగంలో…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి – విదేశాల్లో ఉన్నత చదువుల కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు 2013లో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పథకం.

👉 అధ్యక్షా.

ఈ పథకం ద్వారా సుమారు ₹ 20 లక్షల రూపాయలు అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా విదేశీ చదువుల కోసం వెళ్తున్న సందర్భం లో గత ప్రభుత్వంలో వారు 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు ఈ విదేశీ విద్యా విధానం కొనసాగించారు…గతంలో ఎస్సీ విద్యార్థులకు కేవలం 200 మంది విద్యార్థులకే విదేశాలకు పంపించే అవకాశం ఉండేది.

​👉 అధ్యక్షా,

👉 2023-24 లో సుమారు ఒక ₹ 126 కోట్ల రూపాయలు.!


👉  2024-25 లో ₹144 కోట్ల రూపాయలు, !


👉 2025-26 లో ₹ 336 కోట్ల రూపాయలు!

​👉 సుమారు ₹ 607 కోట్ల రూపాయలు!

ఇప్పటివరకు అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా 2023 నుంచి ఈరోజు వరకు చెల్లించిన విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను.

👉 అధ్యక్షా.

ఈ అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సుమారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా విద్యార్థుల సంఖ్య ను  పెంచిన విషయం . మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. ఈ ప్రజా పాలన, ముఖ్యమంత్రి  నేతృత్వం లో వినలేని ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని మనం చేస్తున్న అంటూ ముగించారు.