👉 నేడు జగిత్యాలలో బండారి ఫంక్షన్ హాల్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఖాయం..
👉 మరో పార్టీలో చేరిక అనుమానం ?
👉 ఇందిరా భవన్ పేరు మార్పు ముందస్తుగా ప్రచురించిన ఉప్పు!
J.SURENDER KUMAR,
రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం లో మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేయనున్న రాజీనామా అంశం పై తర్జనభజన పడుతున్నది వాస్తవం.. జగిత్యాల పట్టణంలోని బండారి ఫంక్షన్ హాల్ లో బుధవారం జరగనున్న జీవన్ రెడ్డి అనుచర వర్గ భారీ సమావేశంలో ఆయన రాజీనామా చేయడం ఖాయం అనేది స్పష్టం అయింది.
రాజీనామా అనంతరం జీవన్ రెడ్డి భారత రాష్ట్ర సమితి ( బి ఆర్ఎస్ ), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరి ఇతర రాజకీయ పార్టీలో చేరిక అనుమానమే అనేది చర్చ. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అంబాసిడర్ గా తెలంగాణలో రాజకీయ వెలుగు వెలిగిన జీవన్ రెడ్డి, జగిత్యాల పట్టణంలోని తన నివాసంను ఇందిరా భవన్ గా నామకరణం చేసుకొని బోర్డు పెట్టుకున్నారు. మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలలో ఇందిరా భవన్ అంటూ ప్రత్యేకంగా పేర్కొనేవారు..

పీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి, సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి పార్టీ విడవద్దు అంటూ చేసిన విజ్ఞప్తి తిరస్కరించారు. వారు గేటు దాటిన వెంటనే తన నివాసానికి ఉన్న ఇందిరా భవన్ బోర్డును ఆయన అనుచర వర్గం తొలగించారు..( ఈనెల 17న ఇందిరా భవన్ పేరు తొలగింపు వార్త ముందస్తుగా ఉప్పు లో ప్రచురితమైంది)

👉 రాజీనామా గూర్చి…
తన అనుచర వర్గం సమావేశంలో జీవన్ రెడ్డి తనకు పార్టీకి ఉన్న 43 సంవత్సరాల అనుబంధం, కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం తన పోరాటం, త్యాగం, తనకు, కాంగ్రెస్ క్యాడర్ కు గత 20 నెలలుగా జరిగిన నామినేటెడ్ పదవులలో ఆన్యాయాలు, పార్టీ నాయకుడి హత్య, అవమానాలు, తాను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి, లిఖితపూర్వక చేసిన ఫిర్యాదులు, తనతో జరిపిన చర్చల సారాంశం, వారు ఇచ్చిన హామీలు, తదితర అంశాలు జీవన్ రెడ్డి అనుచర వర్గానికి వివరించి నాకు మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, ఇవ్వండి అంటూ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది.
👉 అసమ్మతివాదులతో …
రాజకీయ భవిష్యత్తులో ఆరోపణలు ఎదురుకోకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వాదులతో చర్చించనున్నట్టు సమాచారం.
👉 ఉత్తర తెలంగాణ లో..
ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు ముందస్తు ఉత్తర తెలంగాణలో పర్యటిస్తూ ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ, ఉద్యోగుల సమస్యల పై ప్రభుత్వంపై ఆరోపణలు చేయనున్నట్టు తెలిసింది..
👉 బిఆర్ఎస్ – బిజెపి కి దూరంగా !

రాజకీయ ఉద్దండడు జీవన్ రెడ్డి టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.. మారుతున్న రాజకీయ సమీకరణాలు, పుట్టుకొస్తున్న ప్రాంతీయ, పార్టీలు, త్వరలో జరగనున్న ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు తదితర అంశాల పై ఆచితూచి అడుగు వేసి నిర్ణయం తో పాటు పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాలు కూడా జీవన్ రెడ్డి తీసుకునే నిర్ణయంలో కీలకం అనే చర్చ జరుగుతున్నది.
👉 కాంగ్రెస్ చెప్పుకోవడానికి బాబు..?
పిసిసి అధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రులు, కాంగ్రెస్ ఎ ఐ సి సి కార్యదర్శి, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తనను బుజ్జగించడానికి, రాజీనామా చేయవద్దని కోరడానికి జగిత్యాల నా ఇంటికి రావడం, వారు మీడియా సమావేశాల్లో చెప్పుకోవడానికే బాబు..
అంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన ఆత్మీయుల ముందు మంగళవారం అన్నట్టు తెలిసింది.
అన్న ఇంతమంది మన ఇంటికి వచ్చారు చూద్దాం వాళ్ళు ఏం న్యాయం చేస్తారో ? అని ఓ నాయకుడు జీవన్ రెడ్డి తో అన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి, వాళ్లు రేపు మీడియా ముందు చెప్పుకోవడానికి ఈ రావడం, పోవడం అని అన్నట్టు సమాచారం.
బీఆర్ఎస్, బిజెపి అగ్ర నాయకులు, తమ పార్టీలోకి రావాల్సిందిగా జీవన్ రెడ్డిని ఆహ్వానం పలికే అంశంపై ఎలాంటి చర్చలు జరగలేదనేది ఆయన అనుచరు చెపుతున్న మాట.. జీవన్ రెడ్డి, రాజకీయ అడుగులు ఎటువైపు వెళ్లనున్నాయో కొన్ని నెలలపాటు వేచి చూడాల్సిందే..
