👉 రేపో మాపో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయవచ్చు !
👉 నాలుగు దశాబ్దాల బంధానికి తెర ?
👉 ఉత్తర తెలంగాణ జిల్లాలలో కూటమి ?
J.SURENDER KUMAR,
కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడిగా ఎదిగిన జీవన్ రెడ్డి, ఎన్నో రాజకీయ తుఫాన్లను ఎదుర్కొంటూ పార్టీ జెండాను నిలబెట్టిన నాయకుడిగా గుర్తింపు పొందారు. గత పదేళ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో నిలబడి కాంగ్రెస్ ఉనికిని కాపాడిన నాయకుల్లో ఆయన ముందువరుసలో నిలిచారు. అయితే ఇటీవలి పరిణామాలు, పార్టీ లోపలి రాజకీయాలు, స్థానిక స్థాయిలో చోటు చేసుకున్న సంఘటనలు ఆయనను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి.
కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా బంధం అనుబంధం పెనవేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి రెపో మాపో పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయవచ్చు.. వేను వెంటనే ఏ ఇతర రాజకీయ పార్టీలోకి తన అనుచర గణంతో చేరకపోవచ్చు అనేది విశ్వసనీయవర్గాల పక్క సమాచారం.
👉 కూటమి ఆవిర్భావానికి..?
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ లో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా సాగునీటి, పంటలకు గిట్టుబాటు ధర, రైతు సమస్యల తో పాటునిజాంషుగర్ ఫ్యాక్టరీ, ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల అమలు, తదితర అంశాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటానికి ఓ రాజకీయ కూటమి కి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం..
జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం, జీవన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవ నినాదంతో ప్రతిఘటించడం, మున్సిపల్ ఎన్నికలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి, ఆయన అనుచర వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం అగ్రస్థానం కట్టబెట్టడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకోవడానికి జీవన్ రెడ్డి మానసికంగా సిద్ధమైనట్టు చోటు చేసుకున్నపరిణామాలను బట్టి ఊహించవచ్చు.
👉 ఇందిరా భవన్‌లో మార్పులు ?

ప్రజాభవన్ – జనజీవన్ భవన్ పేర్లు వినిపిస్తున్నాయి జీవన్ రెడ్డి నివాసం గృహం ( ఇందిరా భవన్ లో ) ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, జెండాలను అనుచర గణం సోమవారం తొలగించడంతో జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం పక్కాగా తేలిపోయింది. రేపో మాపో ఇందిరా భవన్ పేరును ప్రజాభవన్ , జనజీవన్ భవన్ గా మారవచ్చు అనేది చర్చ..
👉 శ్రీరాముడి పట్టాభిషేక ఫ్లెక్సీలు….?
నిజామాబాద్ పార్లమెంటు పరిధి పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్ తదితర నియోజకవర్గాలలో కరుడుగట్టిన హిందుత్వ భావజాలం యువత శాతం అధికం. మాజీ సీఎం కేసీఆర్ కూతురు నాడు సిట్టింగ్ ఎంపీ కవితను,2018 లో మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డినీ 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఓడించి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను గెలిపించారు. జీవన్ రెడ్డి నివాసంలో వెలసిన శ్రీరామ పట్టాభిషేకం ఫ్లెక్సీల ఆంతర్యం అనుచర గణానికి అంత చిక్కడం లేదు…

👉 జనజీవన స్రవంతిలో కలసిన మావోయిస్టులతో.?
ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు కేంద్ర కమిటీ అగ్ర నాయకులు తిప్పరి తిరుపతి @ దేవుజీ, మల్ల రాజిరెడ్డి, చొక్కరావు, తదితరులు ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజా సమస్యలపై కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మీడియా ప్రతినిధులతో వెల్లడించారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ పద్ధతిలో అంటే ఓ రాజకీయ పార్టీ కి , అనుబంధంగా కాదు అని పదే పదే దేవ్ జి స్పష్టం చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూటమి అంశంపై వారితో చర్చించవచ్చు.. లేదా జనజీవన స్రవంతిలో కలసిన కొందరు మావోయిస్టు అగ్ర నాయకులు జీవన్ రెడ్డి తో ఈ చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది.
👉 వామపక్ష భావాజాలం జీవన్ రెడ్డి ది ?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1982-83 లో కోరుట్ల మండలం మాదాపూర్ లో పోలీసులకు పీపుల్స్ వార్ నక్సలైట్ల కుజరిగిన ఎన్కౌంటర్లో వాసం గజేందర్, అంకం నారాయణలు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ నిజనిర్ధారణ కమిటీలో ప్రొఫెసర్ కోదండరాం, జీవన్ రెడ్డి మరికొందరు పౌర హక్కుల నాయకులు ఎన్కౌంటర్ ప్రాంతాన్ని సందర్శించారు.
2004 వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపింది. ఇందులో వారి ప్రధాన డిమాండ్లలో ఒకటి జీవితకాల శిక్ష పడిన నక్సలైట్ నాయకులు బీర్పూర్ కు చెందిన సముద్రాల మల్లేష్, తుంగూరు కు చెందిన శీలం రమేష్ లను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలన్నది, వారిని దేశ రతగా విడుదల చేయాలని నక్సలైట్ ప్రతినిధుల డిమాండ్.. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఆ ఇద్దరికీ ఫెరోల్ బెయిల్ ఇప్పించారు..
👉 గాయపడ్డ పులి జీవన్ రెడ్డి !

దండకారణ్యంలో గాయపడ్డ పులి గాండ్రింపులు ఎలా ఉంటాయో, నమ్ముకున్న పార్టీలో తనకు, తన అనుచర గణానికి జరిగిన ఆత్మగౌరవ అవమానం, పట్టించుకోని అధిష్టాన తీరుతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై రైతు, ప్రజా సమస్యలపై, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై చేయనున్న పోరాటం గాయపడ్డ పులిలా జీవన్ రెడ్డి గాండ్రింపులు తప్పవని రాజకీయ వర్గాల్లో చర్చ.
సాంకేతికంగా గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం.. గత పది సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి ఒంటరి పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడిన జీవన్ రెడ్డి రాజకీయ చివరి దశలో ( వయసు రిత్యా) అధికార కాంగ్రెస్ పార్టీలో ఆయనకు, ఆయన అనుచర గణానికి లభిస్తున్న ఆదరణ జగమెరిగిన సత్యం. గత ఎమ్మెల్యే , ఎంపీ ఎన్నికలలో జీవన్ రెడ్డి ఓటమి తెలిసిందే.
👉 సానుభూతి సునామి రానున్నదా ?
ధన బలం లేని జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో.. అధికార కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి, ఆయన అనుచర గణానికి అన్యాయం చేసింది అనే అపవాదు మూట కట్టుకున్నది అనేది ప్రజాక్షేత్రంలో గత సంవత్సర కాలంగా మొదలైన చర్చ సోమవారం నాటికి కొనసాగుతున్నది అక్షర సత్యం. త్వరలో జరగనున్న ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికలలో ప్రజల సానుభూతి సునామీలో ఏమి జరగనున్నదో కొన్ని నెలల పాటు వేచి చూడాల్సిందే.
