గణపతి కుమారుడు వాసు కు క్షమాపణలు !

👉 అనుమతి లేకుండా నీ వాయిస్ మెసేజ్ మీడియాకు విడుదల చేశాను !

👉 గణపతి ఆచూకీ కోసం అంతర్జాతీయ నిఘాసంస్థల వేట !

👉 ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు మీడియా ద్వారా విజ్ఞప్తి !

J.SURENDER KUMAR,

శ్రీనివాసరావు @ వాసు, వాసుదేవ్ నన్ను క్షమించు, నీవు నాకు పంపిన వాయిస్ మెసేజ్ మీడియాకు నేను ఇవ్వడం, ఆ విషయంలో నీవు బాధ పడ్డట్టు తెలిసింది. నన్ను క్షమించు వాసు @ శ్రీనివాసరావు అంటూ మావోయిస్టు అగ్ర నేత @ గణపతి కుమారుడికి ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఢిల్లీలో మీడియా ద్వారా క్షమాపణలు కోరుతూ విజ్ఞప్తి చేశారు.

👉 రెండు రోజుల క్రితం మావోయిస్టు అగ్ర నేత ముప్పాళ లక్ష్మణరావు@ గణపతి కుమారుడి వాయిస్ మెసేజ్  భావోద్వేగ ఆవేదనను ఆయన తన బంధు వర్గంతో పంచుకున్నారు.

👉 ఈ నేపథ్యంలో ఆ వాయిస్ మెసేజ్ తమ సమీప బంధువైన ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు కు షేర్ చేశారు. ఈ వాయిస్ మెసేజ్ ను  ప్రకాష్ రావు మీడియా మిత్రులతో పంచుకున్నారు..

👉 ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో పాటు, సోషల్ మీడియాలో ఈ వాయిస్ మెసేజ్ విస్తృతంగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో లక్ష్మణరావు తనయుడు శ్రీనివాసరావు @ వాసు,@ వాసుదేవ్ తాను మీడియా కోసం వాయిస్ మెసేజ్ చేయలేదని, నా బాధ ఆవేదనను బంధుమిత్రులతో పంచుకున్నానని బాబాయ్ ప్రకాష్ రావు, చర్య బాధ అనిపించిందని  గణపతి కుమారుడు బాధపడ్డాడు అని గొనె ప్రకాష్ రావు మీడియా ఛానల్ లో నమస్కారం చేస్తూ క్షమాపణలు కోరారు.

👉 గోనె ప్రకాష్ రావు మాటలలో…..

మావోయిస్టు అగ్రనేత గణపతి కుటుంబంతో నాకు బంధుత్వం ఉందన్నారు. గణపతి ఏనాడు తన కుమారుడిని చూడలేదు, కుమారుడు సైతం గణపతి ముఖం చూడలేదన్నారు.

👉 నాకున్న సమాచారం ప్రకారం గణపతి ఇక్కడ లేడు, నేపాల్ లో ఉన్నట్టు అతడికి, ఉద్యమంలో సుజాత అనే భార్య ఉంది వారికి సంతానం లేదు వయసు రిత్యా  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం.

👉 నాకంటే గణపతి రెండు మూడు సంవత్సరాలు వయసులో చిన్న, గణపతి జన జీవనస్రవంతిలోకి రావాలి, వాళ్ళ నిస్వార్థమైన వారి అనుభవంతో ప్రజాస్వామ్య పద్ధతిలో  సమాజాన్ని చైతన్య పరచాలి నేను వెన్నంటి ఉంటాను.

👉 ప్రస్తుతం సమాజంలో రాజకీయపరంగా భూస్వామ్య వ్యవస్థ కంటే విపరీతమైన దోపిడీ ఉంది.  సమాజంలో దోపిడీ వ్యవస్థ నిర్మూలించడానికి నిస్వార్థ అనుభవం ఉన్న మల్ల రాజిరెడ్డి, దేవుజ్జి గణపతి తదితరులు స్వచ్ఛంద ఆర్గనైజేషన్ మొదలుపెట్టాలి.

👉 మంత్రి సీతక్క, ( ధనసరి అనసూయ) అజ్ఞాతవాసం వీడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై మంత్రి కాలేదా ? స్వర్గీయ గద్దర్ రాజ్యాంగ పద్ధతిలో తిరిగి పోరాటం చేయలేదా ? అన్న హజారే, జయప్రకాష్ నారాయణ వాళ్లు సమాజానికి సేవ చేయడం లేదా ?  నిస్వార్థ మీ అనుభవంతో అవినీతి లేని సమాజం కోసం కృషి చేద్దామన్నారు.

👉 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి !

మార్చి 31 వరకు ఎన్కౌంటర్లను నిలిపివేయండి. అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించండి అంటూ విజ్ఞప్తి చేశారు.

👉 గణపతి కోసం అంతర్జాతీయ నిఘ సంస్థలు ఆరా తీస్తున్నాయి!

గణపతి సామాన్యుడు కాదు అంతర్జాతీయ నిఘా సంస్థ FBI (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) 2020 లో అమెరికా విమానాశ్రయంలో వాసును తనిఖీ చేసి గణపతి గూర్చి ప్రశ్నించాయని గోనె ప్రకాష్ రావు తెలిపారు.  వాస్తవాలను వాసు వారికి వివరించడంతో ఎఫ్ బీ ఐ అధికారులు కన్నీరు పెట్టుకొని వాసు ను హగ్ ( ఆలింగనం) చేసుకున్నారని ప్రకాష్ రావు తెలిపారు. దానికి సంబంధించిన కాన్వకేషన్ నా ఫోన్లో ఉందని అన్నారు . పదే పదే గణపతిని ప్రభుత్వానికి లొంగి జనజీవన స్రవంతిలో కలవాలని  గోనె ప్రకాష్ రావు విజ్ఞప్తి చేశారు.