J SURENDER KUMAR,
మావోయిస్టు ఉద్యమం కగార్ ఆపరేషన్ జ్వాలలకు కరిగిపోతున్నది, కరిగిపోయింది. ఎదురు కాల్పులు, లొంగుబాట్ల, నేపథ్యంలో ఉద్యమ శిఖరం నివ్వెర పోయింది, తమకు ఉగ్గుపాలు రంగరించి ఉద్యమ ఊపిరి పోసిన గణపతి శిష్యగణం తమ ఉద్యమ గురువు గణపతి లొంగుబాటుకు సూత్రధారులు, పాత్రధారులుగా మారారు.
తెలంగాణ ప్రభుత్వానికి వారు లొంగడంతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో అగ్ర నాయకులు క్యాడర్, లీడర్లు లొంగుబాట్లపై గత రెండు రోజుల క్రితం సచివాలయంలో చర్చలు జరిపారు.

👉 ఢిల్లీలో రూట్ మ్యాప్ ?
సీఎం రేవంత్ రెడ్డి, డిజిపి శివధర్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ సుమతి, ఢిల్లీలో హోం శాఖ మంత్రి అమిత్ షా తో జరిగిన సమావేశంలో పలు అంశాలతో పాటు, గణపతి లొంగుబాటు అంశం ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. గణపతి, ఆయనతోపాటు లొంగిపోనున్న నాయకులు, ఉపాధి, రివార్డులు తదితరు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.
👉 గణపతి తలపై 3 కోట్లకు పైగా రివార్డు ?
ముప్పాల లక్ష్మణరావు@ గణపతి తలపై దాదాపు 13 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రివార్డులు ₹ 3 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది అనేది చర్చ. ప్రపంచంలో ఏ ఉద్యమకారుడిపై ఇంత పెద్ద మొత్తంలో రివార్డు లేకపోవచ్చు..
👉 శ్రీలంకలో ?
కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ మావోయిస్టు పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సౌత్ ఆసియా (CCOMPOSA)తో CPI (మావోయిస్ట్) సంబంధాలు కలిగి ఉన్నందున, గణపతి నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, ఫిలిప్పీన్స్ లేదా శ్రీలంకలో ఆశ్రయం పొంది ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నారు.
సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ కొనసాగిన కాలంలో ఎల్టిటితో ఉన్న సంబంధాల నేపథ్యంలో గణపతి శ్రీలంకలో ఉండవచ్చు అనేది చర్చ. 2024 జూలై,ఆగస్టు దండకారణ్యం అబుజ్‌మార్ అటవీ ప్రాంతం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశానికి గణపతి పాల్గొన్నట్టు నిఘా వర్గాల సమాచారం.
