👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 వరకు బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. తాను 2009 నుండి ధర్మపురిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేశానని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉంటేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి తెలిపారు.

ధర్మపురి పట్టణంలో మూతపడిన శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతంలో కళాశాల (నైట్ కళాశాల ) ప్రారంభించడంతో పాటు, విద్యార్థులకు నూతన డిగ్రీ కళాశాల తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.
ధర్మపురిలో బస్ డిపో నిర్మాణం పూర్తి చేస్తామని అలాగే రానున్న గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ధర్మపురి పట్టణానికి కావాల్సిన బైపాస్ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
👉 నష్టపరిహారం చెక్కుల పంపిణి !
ధర్మపురి నియోజకవర్గంలో విద్యుత్ షాక్ తో మరణించిన పశువుల యజమానులు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు.

బుగ్గారం సెక్షన్ పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అనిల్ కు ₹40 వేలు, గోపులాపూర్ గ్రామానికి చెందిన విజయకు ₹ 40 వేలు, రాయపట్నం కి చెందిన సత్తయ్య కు ₹ 40వేలు, నక్కల పేటకు చెందిన గంగవ్వకు ₹ 40వేలు, తుమ్మెనాలకు చెందిన గంగన్నకు ₹7 వేల విలువైన చెక్కులను మంత్రి ఈ సందర్భంగా పంపిణీ చేశారు.
ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సంగనభట్ల దినేష్ తో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ట్రాన్స్ కో ఎస్ఈ సుదర్శనం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
