👉 బాసర క్షేత్రం నుంచి భద్రాచలం వరకు మౌలిక వసతులు ఏర్పాట్ల కోసం సబ్ కమిటీ!
J SURENDER KUMAR,
2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై ముందస్తుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్-కమిటీ ఈనెల 2న ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 319 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు..
క్యాబినెట్ కమిటీ చైర్మన్ గా మంత్రి శ్రీధర్ బాబు, సభ్యులుగా మంత్రులు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దాసరి అనసూయ (సీతక్క) తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే , ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, సభ్యులుగా, కొనసాగుతారు.
2027 లో రానున్న గోదావరి నది పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ముందస్తుగా ప్రణాళికకు శ్రీకారం చుట్టింది..

గోదావరి నది తీరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి భద్రాచలం క్షేత్రం వరకు గోదావరి నది తీరంలో భక్తుల సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లను సబ్ కమిటీ కమిటీ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక ఆధారంగా బడ్జెట్ లో నిధులు ముందస్తుగా పనులు చేపట్టనున్నారు.
సబ్ కమిటీ తో పాటు గోదావరి నది పరివాహక ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వానితులు గా ఉంటారు. సబ్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (దేవాదాయ) శాఖ కన్వీనర్‌గా ఉంటారు.
