గవర్నర్ ను కలసిన సీఎం రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న తెలంగాణ గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ ను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  మర్యాద పూర్వకంగా ఆదివారం సాయంత్రం కలిశారు. ముఖ్యమంత్రి  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో కలిసి లోక్‌భవన్‌లో  జిష్ణు దేవ్ వర్మతో భేటీ అయ్యారు.

గవర్నర్‌గా దాదాపు రెండేళ్ల పాటు తెలంగాణతో ఏర్పడిన అనుబంధం, రాష్ట్రానికి అందించిన సేవలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  గుర్తుచేశారు. ఈశాన్య రాష్ట్రాలతో తెలంగాణకు మధ్య కళలు, సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఆవిష్కరణల వంటి అంశాల్లో నిరంతర సహకారం, పరస్పర అవగాహన కోసం “తెలంగాణ – నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్” పేరుతో జిష్ణు దేవ్ వర్మ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.