J SURENDER KUMAR,
హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల హాకీ ప్రపంచ కప్ 2026 క్వాలిఫైయర్స్ టోర్నమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భారత్‌కు ఉరుగ్వే జట్టుకు మధ్య మ్యాచ్‌ను ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు.
వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల టోర్నమెంట్‌లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్–ఏలో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా దేశాలు, గ్రూప్–బీలో ఇండియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి.

ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ , తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
