J.SURENDER KUMAR,
మూడు సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారు, ఇచ్చిన మాట అక్షరాలు అమలు చేసే ప్రజా నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఒక రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్ర చేసినప్పుడు, 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా పాదయాత్ర సాగుతున్న సందర్భంలో, భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధితులను రేవంత్ రెడ్డి పరామర్శించారు.
ఆ రోజు వారి పరిస్థితి చూసి చలించిపోయిన ఆయన, “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది” అని మాటిచ్చారు. భిక్కనూరు లక్ష్మి, చిట్యాల రాజమణి గార్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వారి సొంత ఇంటి కలను సాకారం చేశారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించడంతో పాటు శనివారం గృహప్రవేశాల సంబరాల్లో కూడా పాల్గొన్నారు. లక్ష్మికి పాత ఇల్లు కూలిపోయిన చోట కొత్త ఇందిరమ్మ ఇంటిని కట్టించారు. అలాగే రాజమణి కి కొత్త ఇంటిని కట్టించి ఇచ్చారు. కొత్త ఇండ్లలోకి అడుగుపెట్టిన శుభసందర్భంగా ఆ ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి తరఫున షబ్బీర్ అలీ సారెను బహుకరించారు.
