👉 సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీ తెలంగాణ భవన్ లో 24 X 7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J.SURENDER KUMAR,
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 ×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అని జగిత్యాల జిల్లా నుండి ఉపాధి కోసం పలువురు ఇరాన్ దేశానికి వలస వెళ్లారని ప్రస్తుతం ఇరాన్ పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు.
👉 ధర్మపురి పట్టణంలో సోమవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు..
👉 న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు మంత్రి వివరించారు.
👉 ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది పేర్కొన్నారు.
👉 ప్రస్తుతం ఇరాన్, గల్ఫ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చు.
👉 24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
(న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పనిచేస్తుంది)
👉 శ్రీమతి వందన బరువా : +91 9871999044
👉 సీహెచ్. చక్రవర్తి : +91 9958322143
👉 జావేద్ హుస్సేన్ : 9910014749
👉 రక్షిత్ నాయక్ : +91 9643723157
👉 మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
👉 ఇరాన్ లో ఉన్న తెలంగాణ పౌరుల యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
