👉 కోటి యాభై లక్షల ఎకరాలకు 9వేల కోట్ల జమ !
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
తెలంగాణ అన్నదాతలకు శుభవార్త. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధులు విడుదలపై ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తో చర్చించారు.
👉 మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు ₹ 3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బదిలీ చేయనున్నారు.
👉 మరో 20 రోజులకు ₹ 2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు వారి ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి ₹.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి.
👉 ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు , సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
