జాతీయ స్థాయిలో ఎస్సీ విద్యార్థులు ర్యాంకులు సాధించడం గర్వకారణం !

👉 యూపీఎస్సీ ఫలితాలలో  తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష–2025 తుది ఫలితాల్లో తెలంగాణ SC స్టడీ సర్కిల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

దళిత వర్గాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

వరంగల్ జిల్లాకు చెందిన A. ఆశిష్ దేశవ్యాప్తంగా AIR–676 ర్యాంక్ సాధించగా, ములుగు జిల్లాకు చెందిన D. ప్రవీణ్ కుమార్ AIR–793 ర్యాంక్ సాధించారు. వీరికి ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) పొందే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

👉 గత సంవత్సరం మే నెలలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో తెలంగాణ SC స్టడీ సర్కిల్‌కు చెందిన 27 మంది విద్యార్థులు అర్హత సాధించి, ఆగస్టులో జరిగిన మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. అందులో 7 మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించగా, చివరకు ఇద్దరు తుది ఎంపిక సాధించడం గర్వకారణమని మంత్రి అన్నారు.

👉 ఇటీవల ప్రకటించిన తెలంగాణ గ్రూప్–I ఫలితాల్లో కూడా తెలంగాణ SC స్టడీ సర్కిల్ విద్యార్థులు దాదాపు 33 ర్యాంకులు సాధించడం సంస్థ శిక్షణ నాణ్యతకు నిదర్శనమని మంత్రి వివరించారు.

👉 దళిత  వర్గాలైన SC, ST, వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉన్నత స్థాయి శిక్షణ అందించి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎక్కువ మంది ఎంపిక కావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

👉 ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన నిధులు, సదుపాయాలను సమయానికి అందిస్తూ అన్ని విధాలా సహకరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రికి మంత్రి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

👉 సమాజంలోని దళిత అట్టడుగు వర్గాల నుండి మరింత మంది యువత సివిల్ సర్వీసెస్ వంటి అత్యున్నత పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఈసారి ఎంపికైన ఆశిష్ మరియు ప్రవీణ్ కుమార్‌లకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి విజయం భవిష్యత్తులో మరెందరో యువతకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.

👉 విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించి వివిధ పోటీ పరీక్షల్లో అగ్రస్థానాలు సాధించేలా కృషి చేసిన తెలంగాణ SC స్టడీ సర్కిల్ డైరెక్టర్  నరసింహ రెడ్డి మరియు సంస్థ సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వారి కృషి ఫలితంగా తెలంగాణలోని SC, ST,  వర్గాలకు చెందిన పేద అభ్యర్థులు ఇప్పటివరకు 1000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ఆయన పేర్కొన్నారు.

👉 సివిల్ సర్వీసెస్–2025లో ఎంపికైన విద్యార్థులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, SCDD & అధ్యక్షుడు  సబ్యసాచి ఘోష్, IAS మరియు కమిషనర్, SCDD & TGSCSC ఉపాధ్యక్షురాలు శ్రీమతి బి. విజయేంద్ర, IAS అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

👉 తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ గూర్చి సంక్షిప్తంగా ..

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ SC స్టడీ సర్కిల్ ప్రతి సంవత్సరం పేద SC, ST, అభ్యర్థులకు 10 నెలల రెసిడెన్షియల్ IAS కోచింగ్ అందిస్తోంది. రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

1980లో స్థాపించబడిన ఈ సంస్థ ఇప్పటివరకు 450 మందికి పైగా సివిల్ సర్వెంట్లను తయారు చేసింది. అలాగే రాష్ట్రంలోని 12 జిల్లా స్టడీ సర్కిల్‌లలో TGPSC, బ్యాంకింగ్, RRB, SSC వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా శిక్షణ అందిస్తోంది.

👉 వివరాల కోసం : http://tsstudycircle.co.in/
సంప్రదించండి.