కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం !

👉 ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి !

👉  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం రాష్ట్ర ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి లక్ష్యమని మహిళల సాధికారత కోసం మా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు..

ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని మణిదీప, వినాయక గ్రామ పరస్పర సహాయక పొదుపు మరియు పరపతి సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు.

👉 అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్  మాట్లాడారు….

ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మహిళలకు అండగా ఉండాలనే సంకల్పంతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై తొలి సంతకం చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని తెలిపారు.

👉 మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు నడిపించే అవకాశాలు, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు వంటి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మహిళలను ఆర్థికంగా బలంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

👉 ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

👉 రాజారాంపల్లి గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.


గ్రామంలో మటన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి పథకాలు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.

👉 మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామంలోని మహిళా సంఘాలకు సభ్యులకు స్వయం ఉపాధి కోసం అవకాశాలు కల్పించాలని గ్రామ సర్పంచ్ సంగ రమేష్ మంత్రి ని కోరారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి లత,   మార్కెట్ కమిటీ చైర్మన్ గోపిక తదితరులు పాల్గొన్నారు.