👉 నాణ్యత విషయంలో రాజీ పడొద్దు !
👉 పైలెట్ ప్రాజెక్టుగా మహిళా సంఘాలకు భవనాలు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ పరిధిలోని బుగ్గారం, పెగడపల్లి, మండలాలలోని గ్రామాలను పలు అభివృద్ధి పనులకు ఆదివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.
మండల కేంద్రమైన బుగ్గారంలో ₹25 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు, ₹10 లక్షలతో నిర్మించే మహిళా సంఘాల వీవో భవనానికి శంకుస్థాపన చేశారు. మండలంలోని వెల్గొండ గ్రామంలో ₹ 5 లక్షలతో చేపట్టి డ్రైనేజీ పనులు, ₹15 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, ₹10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపనలు చేశారు
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …
ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం నిర్మించే నిర్మాణాలలో నాణ్యత లో ఏలాంటి రాజీ లేకుండా కాంట్రాక్టర్ ద్వారా పని చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. భవన నిర్మాణాలు సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలో మహిళా సంఘాలకు కావలసిన వీవో భవనాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. వీవో భవనాల్లో కావలసిన మౌలిక సదుపాయాలకు అవసరమైతే అదనపు నిధులు ఇస్తామని మంత్రి తెలిపారు.
👉 ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి !

బుగ్గారం మండల కేంద్రంలో నక్క లక్ష్మికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కలలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందని మంత్రి అన్నారు. నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల ను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి అన్నారు.
👉 శ్రీనివాస్ కు ట్రై సైకిల్ !

వెలుగొండ గ్రామ పర్యటన లో మంత్రి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగుడు శాఖపురం శ్రీనివాస్ తో మాట్లాడారు.. కొత్త ట్రై సైకిల్ ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. శ్రీనివాస కు పెన్షన్ విషయంపై ఆరాతీసిన వెంటనే వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని ఎంపీడీవోను మంత్రి ఆదేశించారు.
👉 పెగడపల్లి మండలంలో..
👉 సామాన్యులకు సైతం అందుబాటులోకి ఉన్నత విద్యా..

ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
పెగడపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
పెగడపల్లి మండల కేంద్రంలో ₹ 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. పెగడపల్లి మోడల్ స్కూల్ లో ₹10 లక్షలతో నూతనంగా నిర్మించిన వంటశాలను మంత్రి ప్రారంభించారు.

ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2026 – 27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక కిచెన్ షెడ్ ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో మరిన్ని మార్పులు తీసుకువచ్చి సామాన్యులకు ఉన్నత విద్యాను అందించాడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
