లబ్ధిదారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ లక్షలాది రూపాయల పంపిణీ !

👉 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి !

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండలంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధవారం పర్యటించారు మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు  మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, కల్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.


38 మంది లబ్ధిదారులకు ₹ 38 లక్షల 4 వేల 408 రూపాయలు విలువైన చెక్కులను మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్ ,ఎంపీడీవో సుమలత, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్ లు పాల్గొన్నారు.


👉 వార్డు సభ్యులు ప్రజల సమస్యలను పరిష్కరించాలి !

ప్రజల మద్దతుతో గెలిచిన వార్డు సభ్యులు గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలకు అందించాలని మంత్రి  లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……

స్థానిక సంస్థల బలోపేతానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేక దృష్టి సారించారని ఇందులో భాగంగానే ప్రజా పాలన కార్యక్రమాన్ని తీసుకున్నారని మంత్రి తెలిపారు.

గ్రామాల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు కావలసిన ప్రణాళికలు తయారు చేయాలని మంత్రి వార్డు సభ్యులకు సూచించారు.
తాను గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు వార్డు సభ్యులు వారి వారి వార్డుల్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలి మంత్రి వార్డు సభ్యులకు సూచించారు.

ప్రభుత్వ నిబంధన అనుగుణ వార్డు సభ్యులు పనిచేయాలని మంత్రి కోరారు. ధర్మారం మండలంలో పలు గ్రామాల్లో తాగు, సాగు నీటి సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపిస్తామని  మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ప్రజా ఆకాంక్షల మేరకు ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఇప్పటికి నాలుగు గ్యారంటీలను అమలు చేసిందని రానున్న రోజుల్లో మనం రెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాలు మౌలిక సదుపాయాల కోసం తన వంతుగా నిధులు సాధించి అభివృద్ధి చేస్తానని మంత్రి తెలిపారు.