J SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం మద్దులపల్లె గ్రామంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదివారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురకంటి సత్తి రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, తల్లిదండ్రులు సురకంటి చుక్కారెడ్డి, శంకరవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతుల చిత్రపటాలకు ఉమేష్ ఘనంగా నివాళులు అర్పించారు.

వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని మంత్రి ఆకాంక్షించారు.
👉 వివాహ వేడుకలలో…

ఎండపల్లి మండలం ఉండేడ గ్రామానికి చెందిన పోతు సుధాకర్ కుమార్తె దీపిక వివాహ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నూతన వధూవ రులను ఆశీర్వదించారు.
👉 రాజారాం పల్లెలో….

ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామానికి చెందిన బిసగోని మల్లేషం కుమార్తె, అనూష వివాహం రాజారాం పల్లి గ్రామంలోని జేపీఆర్ కల్యాణ మండపంలో జరిగింది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నూతన వధూవ రులను ఆశీర్వదించారు.
